ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleshwaram: చివరి దశకు మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు..

ABN, Publish Date - Jun 24 , 2024 | 03:10 AM

మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకులో చేపట్టిన తాత్కాలిక మరమ్మతు పనులు చివరి దశకు చేరుకున్నాయి. గ్రౌటింగ్‌ ప్రక్రియ తుది దశకు చేరుకోగా షీట్‌ పైల్స్‌ అమరిక పనులు పూర్తికావస్తున్నాయి.

  • అన్నారం వద్ద కొనసాగుతున్న పరీక్షలు

  • చివరి దశకు మేడిగడ్డ

  • బ్యారేజీ మరమ్మతులు

  • అన్నారం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న పరీక్షలు

మహదేవపూర్‌ రూరల్‌/మహదేవపూర్‌, జూన్‌ 23 : మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకులో చేపట్టిన తాత్కాలిక మరమ్మతు పనులు చివరి దశకు చేరుకున్నాయి. గ్రౌటింగ్‌ ప్రక్రియ తుది దశకు చేరుకోగా షీట్‌ పైల్స్‌ అమరిక పనులు పూర్తికావస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షాలతో కొంత మేర పనులకు అంతరాయం ఏర్పడింది. గతంలో న్యూఢిల్లీకి చెందిన సీఎ్‌సఎంఆర్‌ఎస్‌ బృందం పలు పరీక్షలు చేసి వెళ్లింది. బ్లాక్‌-7లోని గేట్ల ఎగువన, దిగువన సేకరించాల్సిన మట్టి నమూనాల పనులు నిర్మాణ సంస్థతోపాటు స్థానిక అధికారులకు అప్పజెప్పి వెళ్లింది.


అయితే.. గేట్ల బే ప్రాంతంలో భారీగా వర్షపు నీరు చేరడంతో నమూనాల సేకరణ కొనసాగడం లేదని తెలిసింది. మరోవైపు బ్యారేజీకి సంబంధించిన ఉన్నతాధికారి న్యాయ విచారణ అనంతరం బదిలీ కాబోతున్నారంటూ చర్చ జరుగుతోంది. అన్నారం బ్యారేజీ వద్ద కేంద్ర జలశక్తి పరిశోధన కేంద్ర నిపుణుల బృందం ఆదివారం కూడా పరీక్షలు నిర్వహించింది.

Updated Date - Jun 24 , 2024 | 03:10 AM

Advertising
Advertising