ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vikarabad: రైతు పొలం నుంచి అక్రమంగా రోడ్డు..

ABN, Publish Date - Jun 21 , 2024 | 03:20 AM

ఒక రైతు పొలం మధ్య నుంచి రిటైర్డ్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తన ఫాం హౌస్‌కు రోడ్డు వేసుకున్నాడు. ఆ రోడ్డును తొలగించేందుకు ప్రయత్నించిన ఆ రైతు కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం మమ్మదాన్‌పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

  • రిటైర్డ్‌ పోలీసు ఫౌంహౌస్‌ కోసం దారి

  • తొలగించాలని కోరినా పట్టించుకోని వైనం

వికారాబాద్‌, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): ఒక రైతు పొలం మధ్య నుంచి రిటైర్డ్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తన ఫాం హౌస్‌కు రోడ్డు వేసుకున్నాడు. ఆ రోడ్డును తొలగించేందుకు ప్రయత్నించిన ఆ రైతు కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం మమ్మదాన్‌పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఎన్కపల్లి చంద్రమ్మకు సర్వే నంబరు 514/ఆ/1లో 1.36 గుంటల పొలం ఉంది. 2016లో ఆ పొలాన్ని పాలెవారు సాగు చేసేవారు. ఆ సమయంలో ఫాం హౌస్‌కు దారి ఉందని చెప్పి రిటైర్డ్‌ పోలీసు అధికారితో దళారులు భూమి కొనిపించారు. చంద్రమ్మకు కాకుండా ఆమె దాయాదులకు డబ్బు ఇచ్చి ఆమె పొలం మధ్య నుంచి రోడ్డు వేశారు. ఆస్తి పంపకాల్లో సర్వే నంబరు 514/ఆ/1లోని పొలం చంద్రమ్మకు వచ్చింది.


ఆమె కుటుంబీకులు తమ పొలంలోని రోడ్డును తొలగించాలని చెప్పినా సంబంధిత వ్యక్తులు పట్టించు కోలేదు. చంద్రమ్మ కొడుకు అశోక్‌ ఎక్స్‌కవేటర్‌తో రోడ్డును తవ్వే ప్రయత్నం చేశాడు. దీంతో మధ్యవర్తులు కేసులతో తనను భయపెడుతున్నారని అతను తెలిపాడు. నవాబుపేట స్టేషన్‌లో ఎస్సై కేసు నమోదు చేయడంపై బాధితుడు గతంలో ఎస్పీ కోటిరెడ్డిని కలిసి వివరించాడు. ఇప్పుడు ఆయన బదిలీపై వెళ్లిపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక అశోక్‌ వేదన చెందుతున్నాడు. కాగా, రోడ్డు తొలగిస్తే తమ సంగతి చూస్తామంటున్నారని అశోక్‌ చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని ఆందోళన చెందుతున్నాడు.

Updated Date - Jun 21 , 2024 | 03:20 AM

Advertising
Advertising