ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana News: ఖరీఫ్ కార్యాచరణకు రేవంత్ ప్రభుత్వం సిద్ధం

ABN, Publish Date - May 16 , 2024 | 07:52 PM

రాష్ట్రంలో ఖరీఫ్ పంట కార్యాచరణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాయత్తమైంది. ఆ క్రమంలో రుణమాఫీ పథకం విధివిధానాలపై గురువారం హైదరాబాద్‌లో మంత్రులు.. టీఎస్ సీడ్స్ ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు.

telangana government

హైదరాబాద్, మే 16: రాష్ట్రంలో ఖరీఫ్ పంట కార్యాచరణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాయత్తమైంది. ఆ క్రమంలో రుణమాఫీ పథకం విధివిధానాలపై గురువారం హైదరాబాద్‌లో మంత్రులు టీఎస్ సీడ్స్ ఉన్నతాధికారులతో చర్చించారు. ఖరీఫ్ పంటల భీమా విధివిధానాలపై మంత్రులు ఉన్నతాధికారులకు దిశా నిర్ధేశం చేశారు.

AP Elections: అలర్ట్: మరిన్ని దాడులు జరగొచ్చు..!!

టెండర్లలో పేర్కొనే నిబంధనలతోపాటు ముందుకు వచ్చే కంపెనీలకు ఉన్న అర్హతలపై ఒకటికి రెండు సార్లు పరిశీలించుకొవాలని సూచించారు. రైతులు పంట నష్టపోయిన సందర్భంలో భీమా పథకం వారిని ఆదుకొనే విధంగా ఉండాలని స్పష్టం చేశారు.


పథకం అమలుకు ఆదర్శ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సమావేశాలు నిర్వహించాలని.. ఆ క్రమంలో వారి అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు మంత్రులు సూచించారు.

AP Elections: భారీ భద్రత మధ్య ‘జేసీ ఫ్యామిలీ’ హైదరాబాద్‌కు తరలింపు


Assembly Elections: సీఎంగా ఉచిత విద్యుత్‌పై తొలి ఉత్తర్వులు

మొదటి విడత పంట నష్ట పరిహారం రూ.15 కోట్లు పంపిణీ పూర్తయినందున, రెండో విడత (ఏప్రిల్) మూడోవిడతలో (మే) జరిగిన పంట నష్ట వివరాలు సమర్పించాలని ఆదేశించారు. మట్టి నమూనా పరీక్షా కేంద్రాల సామార్థ్యాన్ని అనుసరించి, రైతుల పొలాల మట్టి నమూనాలు సేకరించి.. ఫలితాలు వచ్చే నెలాఖరులోగా అందచేసేలా ప్రణాళికలు రూపొందించు కోవాలన్నారు.

LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!

వరి కొయ్యలు కాల్చకుండా యుద్ధ ప్రాతిపదికన రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వరికొయ్యలు తగలపెడితే జరిమానాలు విధించాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న, జొన్న, పొద్దు తిరుగుడు కొనుగోళ్ళను వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.


National Commission for Women: బిభవ్ కుమార్‌కు సమన్లు జారీ

ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం కేటాయించిన భూములలో ఆధునిక సాంకేతికతతో పండ్ల తోటల పెంచడంతోపాటు నిర్వహణ బాధ్యతలు తీసుకొనే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఆయిల్ ఫామ్ కంపెనీల పనితీరు ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు మంత్రులు సూచించారు.

AP Elections: జేసీ ఫ్యామిలీపై పోలీసుల కక్షసాధింపు..!!


మల్బరి సాగుకు అనుకూల ప్రాంతాలను ఎంపిక చేసి.. పట్టు పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలలో మ్యాచింగ్ గ్రాంట్ బకాయి నిధుల విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రులు ఆదేశించారు.

IncomeTax Raids:72 గంటలు తనిఖీలు: రూ.170 కోట్లు సీజ్

అన్ని రకాల సహకార సంఘాలలో సభ్యులను గుర్తించాలని సూచించారు. పదవీకాలం ముగిసిన వెంటనే ఆయా సంఘాలకు సత్వరమే ఎన్నికలు నిర్వహించాలని టీఎస్ ఉన్నతాదికారులకు మంత్రులు స్పష్టం చేశారు.

LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!

Read Latest AP News AND Telugu News

Updated Date - May 16 , 2024 | 08:09 PM

Advertising
Advertising