Share News

కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించండి

ABN , Publish Date - Nov 25 , 2024 | 03:49 AM

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కల్పిస్తున్న ఉచితబస్‌ ప్రయాణం అమలు కోసం కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది.

కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించండి

  • టిమ్స్‌లలో మార్పులు చేయాలి: ఎస్‌డబ్ల్యూఎఫ్‌

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కల్పిస్తున్న ఉచితబస్‌ ప్రయాణం అమలు కోసం కండక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆర్టీసీ యాజమాన్యానికి ఫెడరేషన్‌ అధ్యక్షుడు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వీఎ్‌స.రావులు విజ్ఞప్తి చేశారు. టిమ్స్‌ యంత్రంపై ఏర్పాటు చేసిన జీరో బటన్‌ సమస్యల కారణంగా నెలకు సుమారు 10 మంది కండక్టర్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రధానంగా టిమ్స్‌ యంత్రాలలోని సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేయాలని కోరారు. కండక్టర్‌ పొరపాటు లేకపోయినా ఉద్యోగం కోల్పోయే దుస్థితి ఏర్పడిందన్నారు. కాగా, ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన సుమారు 14వేల మంది కార్మికులకు 2017 వేతన సవరణ బకాయిలను చెల్లించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. కాగా, గ్రాండ్‌ హెల్త్‌ చెక్‌పలో భాగంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోకుండా మిగిలిన ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు బుధవారంలోగా వైద్య పరీక్షలు పూర్తి చేయాలని అధికారులను యాజమాన్యం ఆదేశించింది.

Updated Date - Nov 25 , 2024 | 03:49 AM