TG: కరీంనగర్ బస్టా్‌పలో ప్రసవం..
ABN, Publish Date - Jun 20 , 2024 | 05:24 AM
కరీంనగర్ బస్టా్‌పలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ సిబ్బంది పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. పుట్టిన ఆ పసికందుకు పుట్టిన రోజు కానుకగా జీవితకాలం ఉచిత బస్‌పా్‌సను మంజూరు చేస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.
పసికందుకు జీవితకాలం ఉచిత బస్‌పాస్
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ బస్టా్‌పలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ సిబ్బంది పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. పుట్టిన ఆ పసికందుకు పుట్టిన రోజు కానుకగా జీవితకాలం ఉచిత బస్‌పా్‌సను మంజూరు చేస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఈనెల 16న కుమారి అనే ఓ గర్భిణి భర్తతో కలిసి కరీంనగర్ బస్‌స్టేషన్‌లో భద్రాచాలం బస్సు కోసం ఎదురు చూసింది. ఆ సమయంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108కు సమాచారమిచ్చారు. ఆలోపే నొప్పులు తీవ్రతరం కావడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది ముందుకు వచ్చి చీరలను అడ్డుకట్టి బస్‌స్టేషన్‌లోనే పురుడు పోశారు.
కుమారికి ఆడ బిడ్డ పుట్టింది. సకాలంలో స్పందించి గర్భిణికి కాన్పు చేసిన ఆర్టీసీ ఇబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్యలను టీజీఎ్‌సఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మెచ్చుకున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో వారికి సన్మానం చేశారు. ఆర్టీసీ బస్సులు, బస్‌స్టేషన్‌లలో పుట్టిన పిల్లలకు జీవితకాల ఉచిత బస్‌పాస్ ఇవ్వాలని గతంలో ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. కుమారికి పుట్టిన ఆడపిల్లకు కూడా ఉచిత బస్‌పాస్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
Updated Date - Jun 20 , 2024 | 05:24 AM