ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sabita Reddy: కాంగ్రెస్‌ గ్యారెంటీలకు కాలం చెల్లింది..

ABN, Publish Date - May 09 , 2024 | 01:21 PM

అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అయిదు నెలల్లోనే ప్రజలకు సినిమా చూపిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy) ఆరోపించారు.

- ఎంపీ ఎన్నికలో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయం: సబితారెడ్డి

హైదరాబాద్: అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అయిదు నెలల్లోనే ప్రజలకు సినిమా చూపిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy) ఆరోపించారు. గురువారం సరూర్‌నగర్‌లోని ఏఎస్‌ గార్డెన్‌లో జరిగిన సమావేశంలో చేవెళ్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌, శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌లతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్లమెంట్‌ ఎన్నికల ద్వారా కాంగ్రెస్‌ మరోమారు ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైనదన్నారు. కాంగ్రెస్‌ చేసిన మోసాన్ని గుర్తించిన ప్రజలు మే 13న జరిగే ఎంపీ ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టనున్నారని అన్నారు. కాంగ్రెస్‌ గ్యారెంటీలకు కాలం చెల్లిందన్నారు. బీఆర్‌ఎస్‏తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని, ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి: Annamalai: తెలంగాణ బతుకుల్లో మార్పు రాలేదు...

అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌(Kasani Gnaneshwar) మాట్లాడుతూ పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని కోరారు. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని స్వామిగౌడ్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. సమావేశంలో సరూర్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షులు ఆకుల అరవింద్‌కుమార్‌, ఇంటూరి అంకిరెడ్డి, సుశీలరెడ్డి, యువజన విభాగం మాజీ అధ్యక్షుడు లోకసాని కొండల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ దర్పలి అశోక్‌, ప్రజాసమస్యల పరిష్కార సమితి అధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌ ఆర్‌. గోపాల్‌, రమే్‌షగౌడ్‌, నరేష్ గౌడ్‌, కేశవరెడ్డి, ఇస్మాయిల్‌, జహీర్‌, సలీం, ఉషాగౌడ్‌, ప్రత్యూష్‌, శ్రీనివాస్ గౌడ్‌, శ్రీనివాస్‌, శృతి, సాలెమ్మ, వసంత, శ్వేత, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Etala Rajender: దేశంలో మరోసారి ప్రధానిగా నరేంద్రమోదీ..

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 09 , 2024 | 01:21 PM

Advertising
Advertising