ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SBI Donation: సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాల వెల్లువ

ABN, Publish Date - Sep 06 , 2024 | 04:29 AM

వరద బాధితులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో దాతలు పెద్దఎత్తున ముందుకొస్తున్నారు.

  • ఎస్బీఐ ఉద్యోగుల ఒక రోజు వేతనం రూ.5 కోట్లు అందజేత

  • అరబిందో ఫార్మా నుంచి రూ.5కోట్లు

  • నెల వేతనం విరాళంగా ఇచ్చిన మల్లు రవి

  • ఒక రోజు మూలవేతనం ఇచ్చేందుకు ముందుకొచ్చిన విద్యుత్‌ ఉద్యోగులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి), ఖమ్మ టౌన్‌, సెప్టెంబరు 5: వరద బాధితులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో దాతలు పెద్దఎత్తున ముందుకొస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు, సినీ ప్రముఖులు, వైద్యులు, ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగులు సహా వివిధ రంగాల వారు సీఎంఆర్‌ఎ్‌ఫకు విరాళాలు అందిస్తున్నారు. గురువారం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.5కోట్లను సీఎంఆర్‌ఎ్‌ఫకు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ నివాసంలో ఆయన్ను బ్యాంకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాజే్‌షకుమార్‌.. డిప్యూటీ సీఎం భట్టి, పలువురు బ్యాంకు ఉద్యోగులతో కలిసి చెక్కును అందించారు.


  • అరబిందో ఫార్మా సంస్థ సీఎంఆర్‌ఎ్‌ఫకు రూ.5కోట్లు విరాళంగా ప్రకటించింది. సంబంధిత చెక్కును కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌, ఎండీ కె.నిత్యానంద రెడ్డి, డైరెక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టితో కలిసి సీఎం రేవంత్‌కు అందించారు.

  • ఏఐజీ హాస్పిటల్‌ చైౖర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి ఆస్పత్రి తరఫున సీఎంఆర్‌ఎ్‌ఫకు రూ.కోటి చెక్కును సీఎంకు అందించారు.

  • కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఈమేరకు రూ.1.90 లక్షల చెక్కును సీఎంఆర్‌ఎ్‌ఫకు విరాళంగా అందించారు.

  • రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లోని ఇంజనీర్లు, ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు ఒక రోజు మూలవేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని నిర్ణయించిన మేరకు గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తెలంగాణ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ప్రతినిధులు కలిసి సమ్మతి పత్రాన్ని అందించారు. ఒక రోజు మూలవేతనం దాదాపు రూ.15కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

  • హెటిరో సంస్థలు, సింధు ఆస్పత్రుల అధినేత, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారఽథిరెడ్డి... ఖమ్మం, పాలేరులో వరద బాధితుల సహాయార్ధం గురువారం ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌కు రూ.కోటి చెక్కును అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులకు సహాయంగా రూ.కోటి విరాళం ఇస్తానన్నారు. వరద బాధితులకు వైద్యసేవల కోసం సింధు ఆస్పత్రుల తరఫున వైద్యబృందాలను, మందులను అందుబాటులో ఉంచారు. అందుకు సంబంధించిన అంబులెన్స్‌లను పార్థసారథిరెడ్డి, కలెక్టర్‌, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ప్రారంభించారు.

  • రెండు, మూడ్రోజుల్లో సీఎంఆర్‌ఎ్‌ఫకు రూ.150కోట్లకుపైగా విరాళాల ప్రకటనలు వచ్చినట్టు అఽధికారులు ప్రాఽథమికంగా అంచనా వేస్తున్నారు.

Updated Date - Sep 06 , 2024 | 04:29 AM

Advertising
Advertising