ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SBI: ఎస్‌బీఐలో 13,735 జేఏ పోస్టులు

ABN, Publish Date - Dec 20 , 2024 | 04:29 AM

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ) 13,735 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వాటిలో తెలంగాణలో 342, ఆంధ్రప్రదేశ్‌లో 50 పోస్టులు ఉన్నాయి.

  • తెలంగాణలో 342, ఆంధ్రప్రదేశ్‌లో 50 ఖాళీలు

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సబీఐ) 13,735 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వాటిలో తెలంగాణలో 342, ఆంధ్రప్రదేశ్‌లో 50 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చేనెల 7వ తేదీ వరకు అవకాశమిచ్చింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2024 ఏప్రిల్‌ 1 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి.


అయితే గరిష్ఠ వయో పరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ(జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్ల సడలింపుఉంది. అలాగే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి లేదా గ్రాడ్యుయేషన్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న వారై ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష 2025 ఫిబ్రవరిలో, మెయిన్‌ పరీక్ష 2025 మార్చి/ఏప్రిల్‌లో జరుగుతుంది. వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Updated Date - Dec 20 , 2024 | 04:29 AM