Secunderabad: జీహెచ్‌ఎంసీలో విలీనం వల్ల కంటోన్మెంట్‌కు నష్టాలే ఎక్కువ..
ABN, Publish Date - Jul 09 , 2024 | 08:52 AM
జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం వలన సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad Cantonment)కు లాభాల కంటే నష్టాలే ఎక్కువని నామినేటెడ్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.రామకృష్ణ(J. Ramakrishna) అన్నారు.
- జీహెచ్‌ఎంసీలో విలీనంపై జె.రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
సికింద్రాబాద్: జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం వలన సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad Cantonment)కు లాభాల కంటే నష్టాలే ఎక్కువని నామినేటెడ్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.రామకృష్ణ(J. Ramakrishna) అన్నారు. గతంలో కేసీఆర్ మాదిరిగా రేవంత్‌రెడ్డి కూడా కంటోన్మెంట్ భూములపై కన్నేశారని విమర్శించారు. నిజంగా కంటోన్మెంట్‌ను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాంతానికి నిధులు కేటాయించాలని ఆయన సూచించారు. కంటోన్మెంట్ బోర్డు(Cantonment Board) కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: వామ్మో.. మళ్లీ రూ.12 లక్షలు కొట్టేశారుగా...
జీహెచ్‌ఎంసీ(GHMC) ఇప్పటికే ప్రతి నెలా సిబ్బందికి జీతాలు చెల్లించలేక, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక అవస్థలు పడుతున్నదని తెలిపారు. కంటోన్మెంట్ సిబ్బందికి జీతాలు సమయానికి అందుతున్నాయన్నారు. జీహెచ్‌ఎంసీలో విలీనమైతే కంటోన్మెంట్‌లోని కొన్ని ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు అదనపు అంతస్తు అనుమతి మాత్రమే లభిస్తుందన్నారు. ట్రాఫిక్ సమస్య జఠిలమవుతుందని, కాలుష్య సమస్య పెరుగుతుందని, జనాభా పెరిగి మౌలిక సదుపాయాల సమస్య రెట్టింపు అవుతుందని వివరించారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 09 , 2024 | 08:52 AM