ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Secunderabad: కంటోన్మెంట్‌లో క్రాస్‌ ఓటింగ్‌ భయం...

ABN, Publish Date - May 17 , 2024 | 11:07 AM

‘నమస్తే.. బాస్‌. మీ ఏరియాలో రెండు ఓట్లూ మన పార్టీకే పడ్డాయా, లేక ఒక ఓటు అటు, ఇంకో ఓటు ఇటు పడి ఉండవచ్చా?’ అంటూ.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్‌ సరళిపై ఆయా రాజకీయ పార్టీల విశ్లేషణ కొనసాగుతున్నది.

- అన్ని పార్టీల్లోనూ గుబులు

సికింద్రాబాద్‌: ‘నమస్తే.. బాస్‌. మీ ఏరియాలో రెండు ఓట్లూ మన పార్టీకే పడ్డాయా, లేక ఒక ఓటు అటు, ఇంకో ఓటు ఇటు పడి ఉండవచ్చా?’ అంటూ.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్‌ సరళిపై ఆయా రాజకీయ పార్టీల విశ్లేషణ కొనసాగుతున్నది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ(BRS, Congress, BJP)ల మధ్య త్రిముఖ పోటీ జరిగిన కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో ప్రస్తుతం అన్ని పార్టీలకు క్రాస్‌ ఓటింగ్‌ భయం పట్టుకుంది. సిట్టింగ్‌ శాసనసభ్యురాలు లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌(Secunderabad Cantonment)కు ఉప ఎన్నిక జరిగిన సంగతి విదితమే.


లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికలతోపాటు జరిగిన ఈ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ తరఫున లాన్య నందిత సోదరి నివేదిత, కాంగ్రెస్‌ నుంచి శ్రీగణేష్‌, బీజేపీ తరపున వంశ తిలక్‌లో పోటీ పడ్డారు. కాగా.. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కంటోన్మెంట్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉంది. దాంతో అటు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గానికి, ఇటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఏక కాలంలో జరిగిన ఈ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా నిలిచాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీగణేష్‏కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారంటే హస్తం పార్టీ ఈ ఎన్నికను సవాలుగా తీసుకున్నట్టు అర్థమవుతోంది.


ఇదికూడా చదవండి: Telangana Politics: బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ చిచ్చు!

కాంగ్రెస్‌ పార్టీ గెలుపు బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మల్కాజిగిరి మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హన్మంతరావు తమ భుజస్కందాలపై వేసుకుని, పార్టీ శ్రేణులను ముందుకు కదలించారు. కాగా పోలింగ్‌ ముగియడంతో పార్టీ గెలుపుపై అంచనాలు, విశ్లేషణలు చేస్తున్నా రు. ఏక కాలంలో లోక్‌సభకు, అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగడంతో ఓటర్లు రెండు ఓట్లూ తమ పార్టీకే వేశారా, లేక క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి ఉంటారా? అనే క్రాస్‌ ఓటింగ్‌పై కూపీ లాగుతున్నారు. క్రాస్‌ ఓటింగ్‌ తమ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థికి అనుకూలంగా ఉండవచ్చా, లేక అసెంబ్లీ అభ్యర్థికి అనుకూలంగా ఉండవచ్చా? అనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కూడా కొందరు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి ఉంటే అవతలి పార్టీలోని లోక్‌సభ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించి ఉంటారా, లేక అసెంబ్లీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసి ఉంటారా? అనే విషయమై విశ్లేషిస్తున్నారు.


ఇక బీజేపీ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా మోదీ గ్లామర్‌ నడిచినందున లోక్‌సభ వరకు వస్తే తమ పార్టీకి చెందిన కేడర్‌, ప్రజలతో పాటు ఇతర పార్టీల శ్రేణులు, ప్రజలు తమకు ఓటు వేసి ఉంటారని ధీమాగా ఉన్నారు. అసెంబ్లీ అభ్యర్థి విషయానికి వస్తే ఈ ఓటర్లు తమ అభ్యర్థికి వేసి ఉంటారా, లేక క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి ఉంటారా.. అనేది మేధోమధనం చేస్తున్నారు. మొత్తానికి సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో ప్రస్తుతం ఏ పార్టీ నాయకుడిని, కార్యకర్తను కదిపినా క్రాస్‌ ఓటింగ్‌ గురించే ప్రస్తావన వస్తుండడం గమనార్హం.


ఇదికూడా చదవండి: High Court: జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంటి స్థలంపై వివాదం హైకోర్టులో పిటిషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 17 , 2024 | 11:36 AM

Advertising
Advertising