Secunderabad: సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలి...
ABN , Publish Date - Aug 01 , 2024 | 11:31 AM
నిధుల కేటాయింపుల విషయంలో ప్రతిసారీ సికింద్రాబాద్(Secunderabad)కు అన్యాయం జరుగుతోందని, అందువల్లే సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్(Pawan Kumar Goud) డిమాండ్ చేశారు.
- అభివృద్ధికి 200 కోట్ల నిధులను విడుదల చేయాలి: లష్కర్ జిల్లా సాధన సమితి
హైదరాబాద్: నిధుల కేటాయింపుల విషయంలో ప్రతిసారీ సికింద్రాబాద్(Secunderabad)కు అన్యాయం జరుగుతోందని, అందువల్లే సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్(Pawan Kumar Goud) డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.200 కోట్ల నిధులను విడుదల చేయాలన్నారు. సికింద్రాబాద్ 200 సంవత్సరాల వేడుకల సందర్భంగా ఎంజీరోడ్డులోని బుద్ధభవన్ వద్ద గల స్తూపానికి లష్కర్ జిల్లా సాధన సమితి అధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి, పాలాభిషేకం చేశారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మాటలు కలిపి.. మభ్యపెట్టి.. కదులుతున్న బస్సులోనే అత్యాచారం
ఈ సందర్బంగా గుర్రం పవన్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. 2006 జూన్ 3 నాటికి సికింద్రాబాద్ నగరం ఏర్పడి 200 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నాడు జరిగిన కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) సికింద్రాబాద్ అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. అనంతరం వచ్చిన ఏ ప్రభుత్వమూ చిల్లిగవ్వ విడుదల చేయలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్(Hyderabad) అభివృద్ధికి 10 వేల కోట్ల నిధులను ప్రకటించిందని, నిధుల కేటాయింపులో సికిందాబ్రాద్‌కు అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.
ఇదికూడా చదవండి: KTR: నిండుసభలో మహిళల పట్ల వారి వ్యాఖ్యలు అత్యంత అవమానకరం...
ఇటీవల విజయవాడలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటానని రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రకటించారని, ఆమేరకు సికింద్రాబాద్(Secunderabad)కు రూ.200 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అత్తెల్లి మల్లిఖార్జున్‌గౌడ్, బాల్‌రాజ్‌యాదవ్, మిట్టపల్లి బాబూరావు, జగ్గయ్య, శైలేందర్, జగదీశ్వర్ గౌడ్, వాటర్ వర్క్స్ రిటైర్డ్ ఇంజనీర్ సంగం జగదీశ్వర్, సికింద్రాబాద్ నియోజకవర్గ కన్వీనర్ కొండల్ వెంకటేశ్వర్ రావు, ముషీరాబాద్ కన్వీనర్ రాజేష్, అశోక్‌చారి, కృష్ణ ముదిరాజ్, రవీందర్ సాగర్, ముక్క శ్రీనివాస్, హరి చారీ, అంబులెన్స్ సురేష్ పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు
ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News