KTR: ఆడపడుచులకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి
ABN, Publish Date - Aug 16 , 2024 | 04:35 AM
మహిళలు ఆర్టీసీ బస్సుల్లో బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని మంత్రు లు సీతక్క, పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
కేటీఆర్‌పై కేసు నమోదు చెయ్యాలి
మంత్రులు సీతక్క, పొన్నం
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్టీసీ బస్సుల్లో బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని మంత్రు లు సీతక్క, పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కేటీఆర్ తక్షణమే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.
ఆడవాళ్లు బస్సుల్లో కుట్లు, అల్లికలు చేసుకుంటే తప్పేంటి?సమయం వృఽథా చేయకుండా పనిచేసుకోవడం తప్పా? అని సీత క్క ప్రశ్నించారు. కేటీఆర్‌పై కేంద్ర,రాష్ట్ర మహిళా కమిషన్లు కేసులు నమోదు చేయాలని పొన్నం కోరారు. కేటీఆర్ దురహంకారంతో మాట్లాడుతున్నారని మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి విమర్శించారు.
Updated Date - Aug 16 , 2024 | 04:35 AM