ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అప్పట్లో రుణ మాఫీ కాదు.. వడ్డీ మాఫీనే: సీతక్క

ABN, Publish Date - Dec 22 , 2024 | 04:13 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసింది రుణమాఫీ కాదని, అది వడ్డీ మాఫీ మాత్రమే నని మంత్రి సీతక్క అన్నారు.

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంఽధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసింది రుణమాఫీ కాదని, అది వడ్డీ మాఫీ మాత్రమే నని మంత్రి సీతక్క అన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడే రైతులకు బేడీలు వేశారని గుర్తుచేశారు. శాసనసభలో రైతు భరోసాపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో వరి వేస్తే ఉరి అన్న వారు, కౌలు రైతులకు పైసలు దండుగ అన్న వారు.. ఇప్పుడు సభలో ఆయా అంశాలపై ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.


బీఆర్‌ఎస్‌ హయాంలో నిజంగానే రుణమాఫీ చేసి ఉంటే.. ఇంకా రూ.30వేల కోట్ల రుణ భారం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కాగా, రైతుభరోసాను అర్హులైన వారికి అందించాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ కోరారు. రుణమాఫీలో ఇంకా 20-30ు మేర పెండింగ్‌ ఉందని, దాన్నీ పూర్తి చేయాలన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 04:13 AM