Spoiled Eggs: కేటీఆర్ ట్వీట్ బాధ్యతారాహిత్యం: సీతక్క
ABN, Publish Date - Aug 27 , 2024 | 04:47 AM
భువనగిరి ఘటనలో వాస్తవాలను తెలుసుకోకుండా కేటీఆర్ ట్వీట్ చేయడం బాఽధ్యతారాహిత్యమని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
భువనగిరి ఘటనపై ఆరోజే చర్యలు తీసుకున్నాం
తెలుసుకోకుండా ట్వీట్ చేయడం సరైంది కాదు
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): భువనగిరి ఘటనలో వాస్తవాలను తెలుసుకోకుండా కేటీఆర్ ట్వీట్ చేయడం బాఽధ్యతారాహిత్యమని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిరాజ్‌వాడ అంగన్‌వాడీ కేంద్రం నుంచి పాడైపోయిన గుడ్డు సరఫరా అయిందని, దానిపై సంబంధిత కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ నెల 22న ఘటన జరుగగా... అదే రోజు చర్యలు తీసుకున్నామని కానీ ఆ విషయాన్ని తెలుసుకోకుండా కేటీఆర్ ట్వీట్ చేయడం సమంజసంకాదన్నారు.
విషయం తెలిసిన వెంటనే అదే రోజు మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణితో విచారణ చేయించి, సంబంధిత కోడిగుడ్ల కాంట్రాక్టర్, సెక్టార్ సూపర్‌వైజర్, టీచర్‌తో పాటు ఆయాకు మెమో జారీ చేశామని తెలిపారు. ఈ విషయంపై ఆగస్టు 23న సెక్టార్ సూపర్‌వైజర్ ఆర్. నర్మద, టీచర్ స్వరూపారాణి, హెల్పర్ అరుణలు పాడైపోయిన గుడ్డు సరఫరాకు సంబందించి లిఖిత పూర్వక వివరణ ఇచ్చారని, అయితే వారి వివరణ సరిగా లేకపోవడంతో, భాద్యులను సస్పెండ్ చేేసందుకు అవసరమైన ప్రక్రియను 24 గంటల్లోపే జిల్లా అధికారులు ప్రారంభించారని తెలిపారు ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకుండా అంగన్ వాడీ సెక్టార్ సూపర్ వైజర్లకు కీలక ఆదేశాలు జారి చేసినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రతిరోజూ 18 లక్షలకు పైగా గుడ్లు సరాఫరా అవుతున్నాయని, ఏ చిన్న సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
Updated Date - Aug 27 , 2024 | 04:47 AM