ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల మృతి

ABN, Publish Date - Dec 13 , 2024 | 04:59 AM

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన నేపథ్యంలో.. దక్షిణ అబూజ్‌మఢ్‌లో ఇంద్రావతి దళం నక్సల్స్‌ సమావేశమైనట్లు ఉప్పందుకున్న నాలుగు జిల్లాల పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు జరిపిన కాల్పు ల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.

  • ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మఢ్‌లో ఘటన

  • మృతులంతా ఇంద్రావతి దళ సభ్యులు..

  • వారిలో ఇద్దరు మహిళలు విప్లవ సాహిత్యం, తుపాకుల సీజ్‌

  • అమిత్‌షా పర్యటన వేళ అలజడి!

  • ఏడుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌

  • మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్‌.. మృతులంతా ఇంద్రావతి దళ సభ్యులు!

చర్ల, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన నేపథ్యంలో.. దక్షిణ అబూజ్‌మఢ్‌లో ఇంద్రావతి దళం నక్సల్స్‌ సమావేశమైనట్లు ఉప్పందుకున్న నాలుగు జిల్లాల పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు జరిపిన కాల్పు ల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలి నుంచి తుపాకులు, విప్లవ సాహిత్యా న్ని సీజ్‌ చేశారు. ఈ నెల 13 నుంచి మూడ్రోజుల పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఛత్తీ్‌సగఢ్‌లో పర్యటించనున్నారు. 13న మావోయిస్టు పీఎల్‌జీఏ కమాండర్‌ హిడ్మా స్వగ్రామమైన బీజాపూర్‌ జిల్లా పూవర్తిని కూడా ఆయన సందర్శించనున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో దక్షిణ అబూజ్‌మఢ్‌లో ఇంద్రావతి దళానికి చెందిన 50మందికి పైగా నక్సలైట్లు సమావేశమైనట్లు భద్రతాబలగాలకు సమాచారం అందింది.


దీంతో.. మంగళవారం రాత్రి నుంచే డీఆర్‌జీ పోలీసులు.. సీఆర్‌పీఎఫ్‌, ఎస్టీఎఫ్‌ బలగాలు.. మొత్తం వెయ్యిమంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో.. గురువారం తెల్లవారుజామున మావోయిస్టులు భద్రతాబలగాలపై కాల్పులు జరిపారని బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు. దాంతో పోలీసులు బలగాలు ఎదురుకాల్పులకు దిగాయని, ఐదు గంటల పాటు కాల్పులు కొనసాగాయని చెప్పారు. మావోయిస్టుల వైపు కాల్పులు నిలిచిపోయాక.. ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. కాగా.. శుక్రవారం ఛత్తీ్‌సగఢ్‌కు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా 2026కల్లా నక్సల్స్‌ను అంతమొందించాలనే అజెండా నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం.


ఎన్‌ఐఏ దాడులు

ఛత్తీ్‌సగఢ్‌లోని సుకుమా, ఒడిసాలోని మల్కనగిరి జిల్లాల్లో నక్సల్స్‌తో సంబంధాలున్న వ్యక్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) గురువారం దాడులు జరిపింది. సుకుమాలో ఇద్దరు, మల్కన్‌గిరికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులకు నక్సలైట్లతో సంబంధాలున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి.


11 మంది మావోయిస్టుల లొంగుబాటు

సుకుమా జిల్లాలో గురువారం 11 మంది మావోయిస్టులు ఎస్పీ అమిత్‌ ప్రకాశ్‌ ఎదుట లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో చింతల్నార్‌కు చెందిన హేమ్ల, జోగేంద్ర యాదవ్‌, మడ్కం హంగా మిన హా.. మిగతా వారంతా 20-25 ఏళ్ల వయసున్న యువకులేనని పేర్కొన్నారు.

Updated Date - Dec 13 , 2024 | 04:59 AM