ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kamareddy: మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య!

ABN, Publish Date - Dec 26 , 2024 | 05:37 AM

కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని భిక్కనూరు పోలీ్‌సస్టేషన్‌ ఎస్సై సాయికుమార్‌ బుధవారం రాత్రి కనిపించకుండా పోయారు.

  • మరో వ్యక్తితో కలిసి చెరువులో దూకిన శృతి

  • ఎస్సై సాయికుమార్‌ కూడా అదృశ్యం

  • చెరువు వద్ద ఎస్సై కారు, ఫోన్‌ లభ్యం

  • చెరువులో శృతి, మరో వ్యక్తి మృతదేహం

  • కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఘటన

భిక్కనూరు, డిసెంబరు 25: కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని భిక్కనూరు పోలీ్‌సస్టేషన్‌ ఎస్సై సాయికుమార్‌ బుధవారం రాత్రి కనిపించకుండా పోయారు. అదే సమయంలో బీబీపేట పోలీ్‌సస్టేషన్‌లో పనిచేసే మహిళా కానిస్టేబుల్‌ శృతి, అదే గ్రామానికి చెందిన నిఖిల్‌ అనే వ్యక్తి కూడా అదృశ్యం కాగా.. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో వీరిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే అదే చెరువు వద్ద ఎస్సైకి చెందిన కారు, చెప్పులు లభ్యం కావడంతో ఆయన కూడా చెరువులో దూకారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం డ్యూటీ అయిపోయాక రాత్రి అయినా శృతి ఇంటికి రాకపోవడంతో.. ఆమె తల్లి తాడ్వాయిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శృతి స్నేహితురాలికి ఫోన్‌ చేశారు. తన కూతురు ఇంకా ఇంటికి రాలేదని, ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వస్తుందని తెలిపారు.


ఆమె సూచన మేరకు విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు శృతి ఫోన్‌ను ట్రేస్‌ చేశారు. 44వ జాతీయ రహదారి పక్కన గల అడ్లూర్‌ ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద ఫోన్‌ సిగ్నల్స్‌ ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు అక్కడి వెళ్లి చూడగా శృతి ఫోన్‌తోపాటు భిక్కనూరు ఎస్సై కారు, చెప్పులు, అలాగే బీబీపేటకు చెందిన నిఖిల్‌ అనే వ్యక్తి చెప్పులు, ఫోన్‌ కూడా కనిపించాయి. దీంతో ఎస్సై సాయికుమార్‌కు ఫోన్‌ చేయగా.. స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. పోలీసులు వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించగా.. ఎస్పీ సింధు శర్మ.. సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. చీకట్లోనే చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా.. కానిస్టేబుల్‌ శృతి, నిఖిల్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎస్సై సాయికుమార్‌ ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. ఇంతకీ చెరువు వద్దకు వీరు ఎందుకు వెళ్లారు? ఇద్దరి మృతదేహాలు చెరువులో ఎందుకున్నాయన్నది మిస్టరీగా మారింది.


శృతితో ఎస్సైకి గతంలో పరిచయం..

ఎస్సై సాయికుమార్‌కు కానిస్టేబుల్‌ శృతితో గతంలోనే పరిచయం ఉంది. సాయికుమార్‌ రెండేళ్ల క్రితం బీబీపేట ఎస్సైగా పని చేసిన సమయంలో శృతి అక్కడే పనిచేసేవారు. ఆమెకు అప్పటికే వివాహమై.. భర్తతో విడాకులు కూడా అయ్యాయి. దీంతో సాయికుమార్‌, శృతి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందన్న ఆరోపణలున్నాయి. వీరి మధ్య బీబీపేట సింగిల్‌ విండో సొసైటీలో ఆపరేటర్‌గా పని చేస్తున్న నిఖిల్‌ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత సాయికుమార్‌ భిక్కనూరుకు బదిలీ కావడంతో శృతితో దూరం పెరిగిందని, తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేవడంతో వీరి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలిసింది.

Updated Date - Dec 26 , 2024 | 05:37 AM