ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG: వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడి మృతి

ABN, Publish Date - Jun 09 , 2024 | 04:20 AM

వీధి కుక్కలు మరో పసి బాల్యాన్ని చిదిమేశాయి. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు రెండు రోజులకొకటి జరుగుతున్నా కొంత మంది తల్లిదండ్రులు జాగ్రత్త వహించక తమ పసి మొగ్గలను ఒంటరిగా వదులుతూ వారి నిండు ప్రాణాలను వీధి కుక్కలకు బలి చేస్తున్నారు.

చిలుపూర్‌, జూన్‌ 8: వీధి కుక్కలు మరో పసి బాల్యాన్ని చిదిమేశాయి. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు రెండు రోజులకొకటి జరుగుతున్నా కొంత మంది తల్లిదండ్రులు జాగ్రత్త వహించక తమ పసి మొగ్గలను ఒంటరిగా వదులుతూ వారి నిండు ప్రాణాలను వీధి కుక్కలకు బలి చేస్తున్నారు. తాజాగా జనగామ జిల్లాలో ఆరేళ్ల బాలుడిని తండ్రి ఒంటరిగా వదిలేయడంతో వీధికుక్కల అతడిపై పాశవికంగా దాడి చేసి చంపేశాయి. జనగామ జిల్లా చిలుపూర్‌ మండలం లునావత్‌ తండాకు చెందిన గుగులోత్‌ మధు, సరిత దంపతులకు ఇద్దరు కుమారులుండగా చిన్న వాడైన అభిరామ్‌ (6) శనివారం పొలం పనులకు వెళ్తున్న తల్లిదండ్రుల వెంట వెళ్ళాడు.


ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో తండ్రి బాలుడిని తీసుకొచ్చి తండా సమీపంలో ఒంటరిగా వదిలేసి ఇంటికి వెళ్లమని చెప్పి తిరిగి పొలానికి వెళ్లి పోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలుడు కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా తండాకు సమీపంలోని ఓ వాగులో బాలుడు విగతజీవిగా పడి ఉన్నాడు. ఒంటిపై తీవ్రమైన గాట్లు ఉండడం.. సమీపంలో కుక్కలు మంద కనిపించడంతో వాటి పనేనని గుర్తించారు.

Read more!

Updated Date - Jun 09 , 2024 | 04:20 AM

Advertising
Advertising