ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Revanth Reddy: ఆహ్వానాన్ని సోనియా మన్నించారు..

ABN, Publish Date - May 28 , 2024 | 05:45 PM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

CM Revanth Reddy

ఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరసగా రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో మాత్రం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారం చేపట్టింది. ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ కీ రోల్ పోషించారని కాంగ్రెస్ నేతలు చెబుతుంటారు. దాంతో ఆవిర్భావ వేడుకలకు రావాలని సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.


వెయిటింగ్

‘తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నేతగా సోనియా గాంధీని ఆహ్వానించా. సోనియా గాంధీ రాక కోసం కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి రాష్ట్రానికి వచ్చేందుకు సోనియా గాంధీ అంగీకరించారు. మా అందరి తరఫున సోనియాగాంధీకి కృతజ్ఞతలు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులు అందరినీ వేడుకలకు ఆహ్వానిస్తున్నాం. ఆ జాబితాను రూపొందించాల్సిందిగా కోదండ రామ్‌కు బాధ్యతలు అప్పగించాం. ఉద్యమకారులకు సముచిత గౌరవం దక్కుతుంది. ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి ఆవిర్భావ వేడుకలు ఇవి అని’ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


బీజేపీపై విమర్శలు

‘తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు పండుగ రోజు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీకి పాకిస్థాన్ గుర్తు వస్తుంది. పాకిస్థాన్ ప్రధాని పుట్టినరోజు వేడుకలకు ఎవరు వెళ్లారు..? మోదీ పాక్ ప్రధానిని కౌగిలించుకున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడం, రాజ్యాంగాన్ని మార్చడం అంశాలను లేవనెత్తితే బీజేపీకి పాకిస్థాన్ గుర్తుకొస్తుంది. పదేళ్ల దేశ పురోగతిని బీజేపీ విడుదల చేయాలి. పదేళ్ల పాలన, వైఫల్యాలను కప్పించుకునేందుకు గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. డిపాజిట్లు రాని చోట మెజారిటీ సీట్లు వస్తాయని బీజేపీ గొప్పగా చెబుతుంది. మోదీ గ్యారెంటీ వారంటీ ఫినిష్ అయ్యింది. బీజేపీ మాటలు వినేందుకు దేశ ప్రజలు సిద్ధంగా లేరు. ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దేశ ప్రజలు బీజేపీని గద్దె దించాలని నిర్ణయం తీసుకున్నారు అని’ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.


For More Telangana News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 06:43 PM

Advertising
Advertising