ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prasada Kumar: ‘నేవీ రేడార్‌’ కోసం కేటీఆర్‌ 130 కోట్లు తీసుకున్నడు

ABN, Publish Date - Oct 18 , 2024 | 03:09 AM

‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే 2017లో నేవీ రేడార్‌ స్టేషన్‌ ఏర్పాటుకోసం 44 జీవో తెచ్చి కేటీఆర్‌ రూ.130 కోట్ల నుంచి రూ.135 కోట్లు తీసుకున్నడు. ఇప్పుడేమో రేడార్‌ స్టేషన్‌ ఏర్పాటుతో నష్టమని అంటున్నడు.

  • ఇప్పుడేమో రేడార్‌ స్టేషన్‌తో నష్టమని అంటుండు

  • హైడ్రాతో పాటు మూసీ ప్రక్షాళన గత సర్కారు నిర్ణయాలే

  • అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌

వికారాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే 2017లో నేవీ రేడార్‌ స్టేషన్‌ ఏర్పాటుకోసం 44 జీవో తెచ్చి కేటీఆర్‌ రూ.130 కోట్ల నుంచి రూ.135 కోట్లు తీసుకున్నడు. ఇప్పుడేమో రేడార్‌ స్టేషన్‌ ఏర్పాటుతో నష్టమని అంటున్నడు. ఎంత అబద్ధమో చూడండి.. దీనిపై చర్చ జరగాలి’ అంటూ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవనంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.


దీనికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్‌ మాట్లాడుతూ.. హైడ్రాతో పాటు మూసీ నది ప్రక్షాళన గత ప్రభుత్వ ఆలోచనే అని అన్నారు. దాన్ని ప్రస్తుత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై గ్రామాల్లో చర్చ జరగాలన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని ధ్వంసం చేసిందని.. వారు చేసిన అప్పులకు రూ.7 వేల కోట్ల మిత్తి చెల్లిస్తున్నామని చెప్పారు. ఇచ్చిన హామీలను బీఆర్‌ఎస్‌ సర్కారు ఏమాత్రం నెరవేర్చిందో అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. గతంలో జిల్లా నుంచి ముఖ్యమంత్రి, స్పీకర్‌ ఉన్నారని చెప్పే వారని.. ఇప్పుడు శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి తోడయ్యారన్నారు. ముగ్గురం కలిసి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు.

Updated Date - Oct 18 , 2024 | 03:09 AM