ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Special Trains: దసరాకు ఏపీకి 12 ప్రత్యేక రైళ్లు

ABN, Publish Date - Sep 13 , 2024 | 05:12 AM

దసరా, దీపావళి పండుగల సందర్భంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): దసరా, దీపావళి పండుగల సందర్భంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. అక్టోబరు 2 నుంచి నవంబరు 7 మధ్య సికింద్రాబాద్‌- శ్రీకాకుళం మార్గంలో 12 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ప్రతి బుధ, గురువారాల్లో నడిచే ఈ ప్రత్యేక రైళ్లకు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో హాల్టింగ్‌ ఉంటుందని గురువారం రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్‌ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్లకు అన్నీ త్రీటైర్‌ ఏసీ కోచ్‌లే ఉంటాయని ఆయన తెలిపారు.

Updated Date - Sep 13 , 2024 | 05:12 AM

Advertising
Advertising