ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

K. Kavitha: ‘మూసీ’పై డీపీఆర్‌కు కసరత్తు

ABN, Publish Date - Dec 20 , 2024 | 04:48 AM

మూసీ సుందరీకరణ కోసం డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌) తయారీకి కసరత్తు జరుగుతోందని, ప్రిమిలినరీ ప్రాజెక్టు రిపోర్టు(పీపీఆర్‌) మాత్రం కేంద్ర ఆర్థిక శాఖకు పంపామని మంత్రి శ్రీధర్‌ బాబు చెప్పారు.

  • పీపీఆర్‌ను మాత్రమే కేంద్రానికి పంపించాం

  • బురదజల్లే కార్యక్రమం వద్దు:శ్రీధర్‌బాబు

  • సభాహక్కుల నోటీసు ఇవ్వడంతోనే మూసీపై వాస్తవాలు చెప్పారు: కవిత

హైదరాబాద్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మూసీ సుందరీకరణ కోసం డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌) తయారీకి కసరత్తు జరుగుతోందని, ప్రిమిలినరీ ప్రాజెక్టు రిపోర్టు(పీపీఆర్‌) మాత్రం కేంద్ర ఆర్థిక శాఖకు పంపామని మంత్రి శ్రీధర్‌ బాబు చెప్పారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై మంత్రి శ్రీధర్‌ బాబు తప్పు సమాచారం ఇచ్చారంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొందరు సభ్యులు గురువారం ఇచ్చిన ప్రివిలేజ్‌ మోషన్‌ నోటీసును మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అనుమతించారు. దీనిపై మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. ప్రపంచబ్యాంకు రుణం కోసం డీపీఆర్‌ రూపొందించారా? అని సభ్యులు అడిగారని, లేదని తాను సమాధానం చెప్పానన్నారు. ప్రపంచ బ్యాంకు రుణం పొందాలంటే ఆరు దశలు ఉంటాయని, తాము ఇంకా మొదటి దశలోనే ఉన్నామన్ననరు.


పీపీఆర్‌కు డీపీఆర్‌కు మధ్య వ్యత్యాస్యాన్ని సభ్యులు గుర్తించాలని, బురద చల్లే కార్యక్రమాన్ని పక్కన పెట్టాలన్నారు. సభను సభ్యులే తప్పు దారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన ఏదీ లేదని చెప్పారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ టికెట్ల ధరలు పెంచే ఆలోచన లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కొత్త మెట్రో రైలు ప్రాజెక్టు త్వరలో ప్రారంభం అవుతుందని, కేంద్ర అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. జీవో 317ను సరిదిద్దడానికి కొత్తగా 243, 244, 245 జీవోలు తెచ్చామని వివరించారు. కాగా, ఇంతకాలం మూసీ ప్రాజెక్టు పేరిట ప్రజలను మభ్యపెట్టిన రేవంత్‌రెడ్డి సర్కారు.. బీఆర్‌ఎస్‌ ఒత్తిడితో నిజం చెప్పిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రపంచబ్యాంకు రుణాన్ని కోరామని ఎట్టకేలకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 04:48 AM