Rice Smuggling: రేషన్ బియ్యం అక్రమార్కులకు చెక్
ABN, Publish Date - Oct 12 , 2024 | 04:06 AM
ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎ్‌స)లో పంపిణీ చేసే బియ్యాన్ని నల్లబజారుకు తరలించిన అక్రమార్కులపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్- టాస్క్‌ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు.
నుంచి రూ. 35 కోట్ల ఆస్తుల జప్తు!
ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎ్‌స)లో పంపిణీ చేసే బియ్యాన్ని నల్లబజారుకు తరలించిన అక్రమార్కులపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్- టాస్క్‌ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు. గడిచిన తొమ్మిది నెలల వ్యవధిలో రూ. 35 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశారు. గత ఐదేళ్లలో నమోదైన కేసులు, జప్తు చేసిన ఆస్తులు, ఈ ఏడాది జనవరి నుంచి చేసిన దాడులు, తనిఖీలు, కేసుల వివరాలపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్... రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు.
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా 6(ఏ) కేసులు 333, 291 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 45 వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఈ బియ్యం విలువ రూ. 12.25 కోట్లు కావడం గమనార్హం. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న 271 వాహనాలతోపాటు... రూ. 27 లక్షల విలువైన 29 వేల కిలో లీటర్ల డీజిల్ కూడా జప్తు చేశారు. అదే క్రమంలో మరో రూ. 27 లక్షల విలువైన 900 క్వింటాళ్ల గోఽధుమలు జప్తు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. గడిచిన తొమ్మిది నెలల కాలంలో కేసులు, దాడుల పురోగతి గణనీయంగా పెరిగినట్లు చౌహాన్ పేర్కొన్నారు.
Updated Date - Oct 12 , 2024 | 04:06 AM