TG: అమెరికా స్పెల్ బీలో తెలంగాణ సంతతి విద్యార్థి గెలుపు
ABN, Publish Date - Jun 01 , 2024 | 06:00 AM
అమెరికాలో నిర్వహించే స్ర్కిప్స్ జాతీయ స్పెల్లింగ్ బీ పోటీలో తెలంగాణ సంతతికి చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ సత్తా చాటాడు. ఫైనల్‌లో 90 సెకన్లలోనే 29 పదాల స్పెల్లింగ్స్ తప్పుల్లేకుండా చెప్పి టైటిల్ గెలుచుకున్నాడు. అలాగే రూ.41.64 లక్షల నగదుతో పాటు వివిధ బహుమతులు దక్కించుకున్నాడు.
90 సెకన్లలో 29 పదాలు తప్పుల్లేకుండా చెప్పిన బృహత్
రూ.41.64 లక్షలతోపాటు పలు బహుమతులు సొంతం
న్యూఢిల్లీ, మే 31: అమెరికాలో నిర్వహించే స్ర్కిప్స్ జాతీయ స్పెల్లింగ్ బీ పోటీలో తెలంగాణ సంతతికి చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ సత్తా చాటాడు. ఫైనల్‌లో 90 సెకన్లలోనే 29 పదాల స్పెల్లింగ్స్ తప్పుల్లేకుండా చెప్పి టైటిల్ గెలుచుకున్నాడు. అలాగే రూ.41.64 లక్షల నగదుతో పాటు వివిధ బహుమతులు దక్కించుకున్నాడు. బృహత్‌కు గట్టి పోటినిచ్చిన టెక్సా్‌సకు చెందిన ఫైజాన్ జాకీ 25 పదాలు మాత్రమే చెప్పి రెండో స్థానానికే పరిమితమయ్యాడు.. అతడు రూ.20.82 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. ‘బృహత్ జ్ఞాపకశక్తి అమోఘం.
అతడు ప్రశాంతంగా పదాల స్పెల్లింగ్స్ చెబుతుంటే ఆశ్చర్యపోయా’ అని ఈడబ్ల్యూ స్ర్కిప్స్ కంపెనీ సీఈవో ఆడం సిమ్సన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బృహత్ ఏడో తరగతి చదువుతున్నాడు. అతడి కుటుంబం ఫ్లోరిడాలో నివాసముంటోంది. బృహత్ తండ్రి శ్రీనివాస్ స్వస్థలం తెలంగాణలోని నల్లగొండనే.. బృహత్ ఈ పోటీలో పాల్గొనడం ఇది మూడోసారి.. 2022లో 163వ స్థానం, 2023లో 74వ స్థానంలో నిలిచాడు. బృహత్ కంటే ముందు పలువురు భారత సంతతి విద్యార్థులు కూడా టైటిల్ గెలుపొందారు.
Updated Date - Jun 01 , 2024 | 06:00 AM