ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kalluru: స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి... అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

ABN, Publish Date - Jun 30 , 2024 | 04:12 AM

ఉన్నత విద్యనభ్యసించేందుకు తన వారందరినీ వదిలి అమెరికా వెళ్లిన ఖమ్మం జిల్లా యువకుడు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన శ్రీనాధరాజు కిరణ్‌ (20) హెదరాబాద్‌లో గత ఏడాది ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు.

కల్లూరు, జూన్‌ 29: ఉన్నత విద్యనభ్యసించేందుకు తన వారందరినీ వదిలి అమెరికా వెళ్లిన ఖమ్మం జిల్లా యువకుడు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన శ్రీనాధరాజు కిరణ్‌ (20) హెదరాబాద్‌లో గత ఏడాది ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. ఎంఎస్‌ చదివేందుకు తన తాత ప్రోత్సాహంతో అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరి రాష్ట్రంలోని శ్యాంటలిస్‌ నగరంలో ఉంటున్న కిరణ్‌ శుక్రవారం రాత్రి తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకొట్టేందుకు వెళ్లాడు. ఈత రాని కిరణ్‌ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌పూల్‌లో 8 అడుగుల లోతులోకి జారిపడ్డాడు.


తోటి స్నేహితులకు కూడా పెద్దగా ఈత రాకపోవటంతో కిరణ్‌ను రక్షించలేకపోయారు. నీట మునిగిన కిరణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని కిరణ్‌ స్నేహితులు అతడి బంధువులకు సమాచారం అందించారు. కిరణ్‌ తండ్రి చిన్నతనంలోనే మృతి చెందగా అతడి తాత మనవడి కోరికను కాదనలేక ఒక ఎకరం పొలం అమ్మిమరీ ఎంఎస్‌ చదివేందుకు అమెరికా పంపాడు. ఎంఎస్‌ చదివి వస్తాడని ఆశించిన ఆ కుటుంబంలో కిరణ్‌ మరణ వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. కిరణ్‌ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అతడి స్నేహితులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Jun 30 , 2024 | 04:13 AM

Advertising
Advertising