ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: తాత్కాలిక డీజీపీలా?

ABN, Publish Date - Oct 17 , 2024 | 02:52 AM

రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక డీజీపీలను నియమించుకోవడంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • అడ్‌హక్‌ డీజీపీల నియామకంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

  • తెలంగాణ, ఏపీ సహా 8 రాష్ట్రాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు

  • 21లోపు వివరణ ఇవ్వాలని సీఎస్‌లు, తాత్కాలిక డీజీపీలకు ఆదేశం

న్యూఢిల్లీ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక డీజీపీలను నియమించుకోవడంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక డీజీపీలను నియమించిన ఎనిమిది రాష్ట్రాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఝార్ఖండ్‌, బిహార్‌ రాష్ట్రాలు నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక డీజీపీలను నియమించాయంటూ హరియాణాకు చెందిన వినోద్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.


ఈ సందర్ఫంగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రకాశ్‌సింగ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసుకు సంబంధించి 2006లో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ ఎనిమిది రాష్ట్రాలు అడ్‌హాక్‌ డీజీపీలను నియమించాయని తెలిపారు. నిబంధనల ప్రకారం.. డీజీపీ పోస్టు ఖాళీ అవడానికి మూడు నెలల ముందే యూపీఎస్సీ చైర్మన్‌ అధ్యక్షతన ఉండే కమిటీకి రాష్ట్ర ్టప్రభుత్వం సీనియారిటీ ప్రకారం పేర్లను పంపించాలన్నారు. కనీసం ఆరు నెలల సర్వీసు ఉన్న డీజీ ర్యాంకు అధికారులందరి జాబితాను పంపాలని, మెరిట్‌, సీనియారిటీ ఆధారంగా ముగ్గురు పేర్లను కమిటీ ఖరారు చేస్తుందని పేర్కొన్నారు.


ఆ ముగ్గురిలో ఒకరిని డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ, ప్రస్తుతం ఎనిమిది రాష్ట్రాల్లో తాత్కాలిక డీజీపీలు మాత్రమే ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్ర సీనియారిటీ జాబితాలో 19వ స్థానంలో ఉన్న ప్రశాంత్‌కుమార్‌ను తాత్కాలిక డీజీపీగా నియమించారని తెలిపారు. దీంతో ఎనిమిది రాష్ట్రాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతోపాటు తాత్కాలిక డీజీపీలు తదుపరి విచారణ తేదీ (ఈ నెల 21)లోపు తమ స్పందన తెలియజేయాలని ఆదేశించింది.

Updated Date - Oct 17 , 2024 | 02:52 AM