ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా

ABN, Publish Date - Dec 07 , 2024 | 04:39 AM

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. రెండు వారాల్లో ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. తెలంగాణకు చెందిన విద్యార్థి అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యా నిధి కింద చేయూతనివ్వాలని కోరుతూ దరఖాస్తు చేశాడు.

  • రెండు వారాల్లో చెల్లించాలని సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. రెండు వారాల్లో ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. తెలంగాణకు చెందిన విద్యార్థి అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యా నిధి కింద చేయూతనివ్వాలని కోరుతూ దరఖాస్తు చేశాడు. విద్యార్థి తండ్రి సంవత్సర ఆదాయం రూ.2లక్షలు మించిందన్న కారణంతో ఆ దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. దాంతో విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. 2023లో ఆ విద్యార్థికి రూ.10లక్షల స్కాలర్‌షిప్‌ ఇవ్వాలని ఆదేశించింది. 161రోజుల తర్వాత హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పును ప్రభుత్వం సవాల్‌ చేసింది.


ఆ పిటిషన్‌ను ఈ ఏడాది సెప్టెంబరు 9న హైకోర్టు తిరస్కరించింది. దాంతో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 19న సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌ శుక్రవారం జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో రిట్‌ దాఖలు చేయడానికి 161 రోజులు ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.లక్ష జరిమానా విధించి, పిటిషన్‌ను కొట్టివేసింది.

Updated Date - Dec 07 , 2024 | 04:39 AM