ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Suraram: ఏసీబీకి పట్టుబడ్డ సూరారం సీఐ!

ABN, Publish Date - Jun 22 , 2024 | 05:17 AM

భూ వివాదంలో తలదూర్చి, ఓ వర్గానికి సహకరించేందుకు సిద్ధమైన ఆ సీఐ, లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు! లంచం తీసుకుంటుండగా ఆయన్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడింది సూరారం సీఐ ఆకుల వెంకటేశం.

  • భూ వివాదంలో జోక్యం..లంచంగా రూ.5 లక్షలు డిమాండ్‌

  • 2లక్షలు ఇచ్చినా మిగతా మొత్తం ఇవ్వాలని బాధితుడిపై ఒత్తిడి

  • ఏసీబీకి సమాచారం.. రూ.లక్ష తీసుకుంటుండగా పట్టివేత

గాజులరామారం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): భూ వివాదంలో తలదూర్చి, ఓ వర్గానికి సహకరించేందుకు సిద్ధమైన ఆ సీఐ, లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు! లంచం తీసుకుంటుండగా ఆయన్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడింది సూరారం సీఐ ఆకుల వెంకటేశం. కుత్బుల్లాపూర్‌ మండలం గాజులరామారంలో ఉంటున్న రత్నాకర్‌సాయిరాజ్‌ అనేవ్యక్తి గాజులరామారంలో స్థలం కొనుగోలుపై కొందరు వ్యక్తులతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య గొడవలు జరడటంతో సూరారం పోలీసులు రత్నాకర్‌సాయిరాజ్‌పై కేసు నమోదు చేశారు. రత్నాకర్‌సాయిరాజ్‌ను సూరారం సీఐ ఆకుల వెంకటేశం, పీడీయాక్డు పెడతామని బెదిరించారు.


పీడీ యాక్ట్‌ పెట్టకుండా ఉండేందుకు, వివాదాస్పద స్థలంలో నిర్మాణాలకు సహకరించేందుకు లంచంగా రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రత్నాకర్‌సాయిరాజ్‌ నుంచి ఆయన గతంలోనే రూ. 2లక్షలు తీసుకున్నారు. మిగిలి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని రత్నాకర్‌పై ఒత్తిడి తీసుకు రావడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం రత్నాకర్‌సాయిరాజ్‌ నుంచి రూ. లక్ష తీసుకుంటుండగా సీఐ వెంకటేశాన్ని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Updated Date - Jun 22 , 2024 | 05:17 AM

Advertising
Advertising