Chandrababu: చంద్రబాబు సరికొత్త వ్యూహం.. పూర్వ వైభవం వస్తుందా..!
ABN, Publish Date - Aug 26 , 2024 | 05:45 PM
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ.. పక్క రాష్ట్రం తెలంగాణలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ.. పక్క రాష్ట్రం తెలంగాణలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో.. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాయి. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉండేది. పార్టీ అధినేత చంద్రబాబు 2014లో ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడంతో తెలంగాణలో క్యాడర్ పక్కపార్టీల్లోకి వెళ్లిపోయారు. ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకున్ని ఉన్న నాయకులు మినహా.. మిగతా నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వరుసగా తెలంగాణలో పదేళ్లపాటు బీఆర్‌ఎస్ అధికారంలో ఉండటంతో టీడీపీ బలపడితే తమకు ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో కేసీఆర్ తెలుగుదేశం పార్టీని ఎదుగుదలను పరోక్షంగా అడ్డుకున్నారు. పదేళ్ల తరువాత పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రస్తుతం బీఆర్‌ఎస్ తెలంగాణలో బలహీనపడుతోంది. ఈ క్రమంలో మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు.
CM Revanth: సీఎం రేవంత్, మంత్రులపై మహేశ్వర రెడ్డి నిప్పులు
తెలంగాణపై ఫోకస్
చంద్రబాబు నాయుడు తాజాగా తెలంగాణ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. నెలలో రెండు సార్లు తెలంగాణ పరిస్థితిపై సమీక్షిస్తానని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. 2014 తర్వాత ఏపీపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడంతో తెలంగాణపై అధినేత ఫోకస్ తగ్గించారు. ఇక 2019 తర్వాత ఏపీలో ప్రతిపక్షంలో ఉండటంతో అక్కడ పార్టీని బలోపేతం చేసుకుని 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్లారు. దీంతో టీడీపీ కూటమి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. తెలంగాణలో కొంత బలహీనపడింది. గత అనుభవాల దృష్ట్యా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై చంద్రబాబు దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఓ అడహాక్ కమిటీని వేసి.. ఆ తర్వాత పూర్తిస్థాయి కమిటీని వేయాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో తెలంగాణలో టీడీపీ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది.
Akbaruddin Owaisi: ఆ స్కూల్ మాత్రం కూల్చకండి.. అక్బరుద్దీన్ ఓవైసీ సంచలనం
టీడీపీలో చేరేందుకు ఆసక్తి..
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలుచుకోకపోవడంతో బీఆర్ఎస్ కొంత బలహీన పడుతూ వస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు సైతం ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్, కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో టీడీపీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గతంలో టీడీపీలో పనిచేసి బీఆర్‌ఎస్‌లో చేరిన కొందరు నేతలు సొంతగూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్, బీజేపీలో చేరడం ఇష్టంలేని నాయకులు సైతం టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఒకవేళ ఇదే జరిగితే రానున్న రోజుల్లో టీడీపీ పూర్వ వైభవాన్ని సాధిస్తుందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
HYDRA News: హైడ్రా కూల్చివేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh, Telangana News and Latest Telugu News
Updated Date - Aug 26 , 2024 | 05:45 PM