ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: త్వరలో టీడీపీలోకి తీగల

ABN, Publish Date - Oct 08 , 2024 | 04:32 AM

తాను త్వరలో టీడీపీలో చేరబోతున్నానని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. టీడీపీకి పూర్వ వైభవం కోసమే చంద్రబాబుతో భేటీ అయ్యానని చెప్పారు.

  • చంద్రబాబుతో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి భేటీ

  • రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తెస్తానని వ్యాఖ్య

  • బాబును కలిసిన ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి)/మేడ్చల్‌(ఆంధ్రజ్యోతి ప్రతినిధి), అక్టోబరు 7: తాను త్వరలో టీడీపీలో చేరబోతున్నానని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. టీడీపీకి పూర్వ వైభవం కోసమే చంద్రబాబుతో భేటీ అయ్యానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో చంద్రబాబును కలిశారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. అనంతరం మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డితో కలిసి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, హుస్సేన్‌సాగర్‌ అభివృద్ధి చెందాయని అన్నారు. సైబరాబాద్‌ను ఏర్పాటు చేసిన ఘనత ఆయనదేనని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌, చంద్రబాబులతోనే తన రాజకీయ ప్రస్థానం ఆరంభమైందని తెలిపారు. తెలంగాణలో కూడా ఎన్టీఆర్‌ పాలన రావాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్‌ అభిమానులు ఉన్నారని పేర్కొంటూ, వారందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తామన్నారు. మరోసారి తమను పిలిచి మాట్లాడతానని చంద్రబాబు చెప్పారని ఆయన వివరించారు.


  • ఆసక్తికరంగా మల్లారెడ్డి భేటీ..

బీఆర్‌ఎస్‌ నుంచి మేడ్చల్‌ ఎమ్మెల్యేగా గెలిచిన మల్లారెడ్డి టీడీపీలో చేరబోతున్నారా? అన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. సోమవారం మల్లారెడ్డితో పాటు ఆయన అల్లు డు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు.తీగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి బంధువులు. తాను టీడీపీలో చేరబోతున్నానని తీగల ప్రకటించిన నేపథ్యంలో మల్లారెడ్డి కూడా ఆయన బాటలోనే వెళతారన్న చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. అయితే, టీడీపీ లో తన చేరికపై మల్లారెడ్డి, సమాధానాన్ని దాటవేశారు. తన మనవరాలు (మర్రి రాజశేఖర్‌రెడ్డి కుమార్తె) పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేసేందుకే వచ్చానని చెప్పారు. కాగా, ఈ నెల 27 న తన మనవరాలి వివాహం ఉందని.. అప్పటి వరకు కోర్టు పరిధిలో ఉన్న బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేల విషయంలోనూ ఏదో ఒకటి తేలుతుందని.. ఆ తర్వాత తాను కూడా టీడీపీలో చేరతానని మల్లారెడ్డి సన్నిహితులతో అన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Updated Date - Oct 08 , 2024 | 04:32 AM