ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Assembly Debate: రేవంత్‌ X కేటీఆర్‌!

ABN, Publish Date - Jul 25 , 2024 | 02:57 AM

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అంశంపై బుధవారం అసెంబ్లీలో నిర్వహించిన చర్చ సీఎం రేవంత్‌రెడ్డి వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నట్లుగా సాగింది.

  • కేసీఆర్‌ వస్తే.. ఢిల్లీలో దీక్షకు నేను సిద్ధం

  • నిధులు తెచ్చుడో.. అవసరమైతే చచ్చుడో

  • అయ్యపేరు, తాతపేరు చెప్పుకొని రాలేదు

  • స్వయంకృషితో ఎదిగా.. సీఎం కుర్చీలో కూర్చున్నా

  • నిధులు వద్దని, మీ ప్రేమ ఉంటే చాలునని

  • మోదీకి కేసీఆర్‌ ఊడిగం చేయలేదా?: రేవంత్‌

  • పేమెంట్‌ కోటాలో సీఎం అని మేమూ అనగలం

  • పదవుల కోసం రేవంత్‌రెడ్డి పార్టీలు మారారు

  • మేం రాష్ట్రం కోసం పదవులు వదులుకున్నాం

  • ఢిల్లీలో బీజేపీతో సీఎం రేవంత్‌కు దోస్తీ: కేటీఆర్‌

  • నిధులు వద్దని, మీ ప్రేమ ఉంటే చాలునని...

  • ప్రధాని మోదీకి కేసీఆర్‌ ఊడిగం చేయలేదా?

  • కేసీఆర్‌ కూడా వస్తే.. ఢిల్లీలో దీక్షకు నేను సిద్ధం

  • నిధులు తెచ్చుడో.. అవసరమైతే చచ్చుడో

  • అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌

  • ఢిల్లీలో మంత్రివర్గం దీక్ష చేస్తే మద్దతు: కేటీఆర్‌

‘‘రేవంత్‌రెడ్డి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు. సహనం, ఓపిక ఉండాలి. సంయమనం పాటించాలి. మాటిమాటికీ మాపై విరుచుకుపడితే ఎలా? పేమెంట్‌ కోటాలో

సీఎం సీటు కొట్టేసిండని మేము కూడా అనొచ్చు. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే... రాహుల్‌గాంధీని అంటుండా? రాజీవ్‌గాంధీని అంటుండా? నాకైతే తెల్వదు’’

-బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌

‘నేను గతంలో మంత్రిగా పనిచేయలేదని, నాకు సభా వ్యవహారాలు తెలియవని

కేటీఆర్‌ అంటున్నారు. మా నాయన

ఉచితంగా కుర్చీలు ఇచ్చి.. చదువు

రాకపోయినా మంత్రిని చేయలేదు.

కష్టపడి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి.. స్వయంకృషితో పైకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా. అయ్యపేరు, తాతపేరు చెప్పుకొని నేను ఇక్కడికి రాలేదు’’ - సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అంశంపై బుధవారం అసెంబ్లీలో నిర్వహించిన చర్చ సీఎం రేవంత్‌రెడ్డి వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నట్లుగా సాగింది. కేటీఆర్‌ మాట్లాడుతున్న సమయంలో రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకోవడం, అందుకు మళ్లీ కేటీఆర్‌ సమాధానమివ్వడం, ఇరువురూ పరస్పరం విమర్శలు వేసుకోవడంతో చర్చ వాడివేడిగా జరిగింది. కేటీఆర్‌ మాట్లాడుతూ, ‘‘సభలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మాకు ముందస్తు సమాచారం ఇవ్వాలి కదా? గతంలో మేం పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపినం. సభా మర్యాదలు పాటించాం’’ అని అన్నారు. దీనిపై సీఎం రేవంత్‌ జోక్యం చేసుకుంటూ, ‘‘ఈ కుటుంబమంతా సభను, రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకుంది. చర్చపై అభిప్రా యం చెప్పమంటే.. ఏవేవో కెలికి మాట్లాడుతడు. మొన్న ఢిల్లీ వెళ్లి చీకట్లో మాట్లాడుకున్నదే మీ అభిప్రాయం అనుకోవాలా? సభలో ఏదో ఒకటి మాట్లాడితే.. సభ నుంచి స్పీకర్‌ బయటకు పంపిస్తే.. బతుకు జీవుడా అని వెళ్లిపోదామనుకుంటున్నారు. స్పీకర్‌గారూ.. వాళ్లను బయటికి పంపొద్దు. తెలంగాణ ప్రజల ముందు వాళ్లను అలాగే నిలబెట్టాలి’’ అని అన్నారు.


8 ప్లస్‌ 8 సున్నా అయ్యాయి..

సాధారణంగా 8+8 కలిపితే 16 అవుతాయని, కానీ.. ఇప్పుడు 8+8 కలిస్తే గుండు సున్నా అనే భావన కలుగుతోందని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్‌, బీజేపీకి కలిపి 16 ఎంపీ సీట్లు ఇచ్చినా.. రాష్ట్రానికి న్యాయం జరగలేదని, పదేళ్లలో జరిగిన అన్యాయమే ఇప్పుడూ జరిగిందని తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌ల బడేభాయ్‌- చోటేభాయ్‌ అన్నదమ్ముల అనుబంధం ఏమైందని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ అనే పదం నిషేధించినట్లుగానే.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పదం వినపడకపోవటానికి అక్కడ బీఆర్‌ఎస్‌ ఎంపీలు లేకపోవటమే కారణమని వ్యాఖ్యానించారు. తనదాకా వస్తేగానీ తత్త్వం బోధపడలేదని, బడేభాయ్‌ సంగతి చోటేభాయ్‌కి ఇప్పుడు తెలిసివచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ బ్రాండ్‌ను దెబ్బతీస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. అప్పులు, వడ్డీలు అంటూ ప్రచారం చేస్తే.. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రావని, ఐదేళ్లు పరిపాలించడం మీకే కష్టమవుతుందని హితవు పలికారు. ఇందుకు రేవంత్‌ స్పందిస్తూ.. మిగులు బడ్జెట్‌తో అప్పజెప్పిన రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని, పదేళ్లలో రాష్ట్రాన్ని దోపిడీ చేశారని ఆరోపించారు. ఆ వాస్తవాలను ప్రజలకు చెప్పకపోతే ఎలా? అని ప్రశ్నించారు.


ప్రజలు తీర్పు ఇచ్చినా జ్ఞానోదయం కలగదా?

‘‘పదేళ్లలో మీరేం చేశారో చూసిన తర్వాతే ప్రజలు తీర్పు ఇచ్చారు. అయినా మీకు జ్ఞానోదయం కలగడం లేదు. చులకనభావం, అహంభావంతో మాట్లాడే వైఖరి పోవడంలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే స్థానాల్లో మెజారిటీ వస్తే.. పార్లమెంటు ఎన్నికల్లో మూడు చోట్లనే మెజారిటీ వచ్చింది? 2014లో 12 మంది ఎంపీలు, 2019లో 9 మంది గెలిచిన మీకు 2024 ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది. అయినా బుద్ధి మారకపోతే ఎలా?’’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు 2014లో రెండు ఎంపీ సీట్లు రాగా, 2019లో 3 సీట్లు వచ్చాయని, ఇటీవలి ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నామని గుర్తు చేశారు.


గడచిన పదేళ్లలో ప్రతి సందర్భంలోనూ కేంద్రంలోని బీజేపీకి బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందని, జీఎస్టీ బిల్లు, నోట్ల రద్దు, ఆర్‌టీఐ సవరణ బిల్లు, నోట్ల రద్దుతోపాటు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నిక, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నిక, సాగు చట్టాలు, అవిశ్వాస తీర్మానం.. ఇలా అన్నింటినీ సమర్థించిందని తెలిపారు. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి దుర్మార్గంగా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ‘‘ఒక దళితుడు రాష్ట్రపతి అవుతున్నడని కోవింద్‌కు మద్దతు ఇచ్చినం. తెలుగుబిడ్డ వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అవుతున్నాడని ఓట్లేసినం. అంతేగానీ సాగు చట్టాలకు మేం మద్దతివ్వలేదు. ఏదైనా ఉంటే బాజాప్తా చేసినం తప్ప చీకటి స్నేహాలు చేయలేదు. ఢిల్లీలో బీజేపీ ఎంపీలతో రేవంత్‌రెడ్డే చీకటి స్నేహాలు చేస్తున్నారు. ఇప్పటికీ బీజేపీ ఎంపీలే రేవంత్‌రెడ్డి పనులు ఢిల్లీలో చేసి పెడుతున్నారు. మేం రాష్ట్రం కోసం పదవులు వదులుకున్నాం. పదవులకోసం పార్టీలు మారే అలవాటు మాకులేదు’’ అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు.


మోదీ ప్రేమ ఉంటే చాలునన్న కేసీఆర్‌..

మోదీకి కేసీఆర్‌ ఎలా ఊడిగం చేశారో అన్ని సాక్ష్యాలూ ఉన్నాయని సీఎం రేవంత్‌ అన్నారు. పదేళ్లలో చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని ఆకాశానికి తీసుకెళ్లినట్లుగా మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ‘‘మిషన్‌ భగీరథ ప్రారంభోత్సవానికి మెదక్‌ జిల్లా కోమటిబండకు 2016 ఆగస్టులో ప్రధాని మోదీ వస్తే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమీ కోరబోమని కేసీఆర్‌ అన్నారు. మాకు మీప్రేమ, ఆశీర్వాదం ఉంటే చాలునన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కేంద్రం కాలరాస్తుంటే.. ప్రతిపక్ష నేతగా సభకు రాకుండా, కేంద్రాన్ని నిలదీయకుండా.. మోదీకి తాకట్టు పెట్టి కాంగ్రెస్‌కు విమర్శించడంలో న్యాయం ఉందా?’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో పార్లమెంటు మెట్లపై తమ ఎంపీలతో కలిసి రాహుల్‌, సోనియా, మల్లికార్జున ఖర్గే దీక్ష చేస్తున్నారని, బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీలు ఎక్కడున్నారో లెక్కపెట్టుకోవాలని కేటీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. విలీనం కోసం ఢిల్లీలో ఇల్లిళ్లు తిరిగి, చీకట్లో కౌగిలించుకొని వచ్చి.. సభలో రాజకీయ వివాదాలపై చర్చ పెడుతున్నారని ఆరోపించారు. దీంతో, విలీనాలు, చీకటి ఒప్పందాలు చేసుకునే దౌర్భాగ్యం తమకు లేదని కేటీఆర్‌ బదులిచ్చారు.


కిషన్‌రెడ్డితో చిరునవ్వులు చిందించిన భట్టి..

సింగరేణి గనులను వేలం వేస్తుంటే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిరునవ్వులు చింది స్తూ.. వేదిక పంచుకున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్ర యోజనాల విషయంలో తామెన్నడూ రాజీ పడలేదని, ఎవరితోనైనా కొట్లాడతామని స్పష్టం చేశారు. ఏపీకి నిధులివ్వడం సంతోషమేనని, కానీ.. తెలంగాణకు ఇవ్వకపోవడం బాధగా ఉందన్నారు. పదేళ్లలో కేంద్రం సహకరించకపోయినా తాము అభివృద్ధిని ఆపలేదని, అన్నిరంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత.. టీఆర్‌ఎ్‌సను కాంగ్రెస్‌లో విలీనం చేద్దామనుకున్నామని, కానీ.. దిగ్విజయ్‌సింగ్‌ వైఖరి వల్ల అది సాధ్యం కాలేదని చెప్పారు. ఏది ఎలా ఉన్నా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం పెట్టిన చర్చకు తాము మద్దతిస్తున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు.


విద్యుత్తు రంగాన్ని అదానీకి అప్పగించి ప్రైవేటుపరం చేయొద్దన్నారు. ఎస్పీడీసీఎల్‌ పరిధిలో పాతబస్తీలో బిల్లుల వసూళ్ల బాధ్యతలు అదానీకి అప్పగించారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రే ప్రకటించారని కేటీఆర్‌ అనడంతో.. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అభ్యంతరం చెప్పారు. సీఎం ఎప్పుడూ, ఎక్క డా ఆ మాట అనలేదని తెలిపారు. ‘‘కేంద్రాన్ని విమర్శిస్తే బీజేపీకి, మోదీకి ఎక్కడ కోపమొస్తదోనని కేటీఆర్‌ భయపడుతున్నారు. వారితో అంటకాగుతారో, మీ పార్టీని బీజేపీలో విలీనం చేసుకుంటారో మీ ఇష్టం’’ అని భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ దళితుడని మద్దతిచ్చామంటున్నారని, మరి లోక్‌సభ స్పీకర్‌గా ఉండి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదించిన మీరాకుమార్‌ దళితురాలు కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమెకు ఓటు వేయకపోగా, రాష్ట్రానికి వస్తే.. కనీసం ప్రొటోకాల్‌ కూడా పాటించలేదని మండిపడ్డారు.


కేసీఆర్‌ దీక్షకు రా.. నేను సిద్ధం: రేవంత్‌

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నిధుల కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేసేందుకు తాను సిద్ధమని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నిధుల కోసం ఢిల్లీలో దీక్ష చేయాలన్న బీఆర్‌ఎస్‌ సభ్యులు కేటీఆర్‌, హరీశ్‌రావు సవాళ్లపై రేవంత్‌ ఈ మేరకు స్పందించారు. ‘‘చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చానని మేమెప్పుడు అబద్ధాలు చెప్పలేదు. రూ.100 పెట్టి పెట్రోల్‌ కొన్నారు కానీ పదిపైసలు పెట్టి అగ్గిపెట్టె కొనలేదు. జంతర్‌ మంతర్‌ వద్దకు కేసీఆర్‌ను రమ్మనండి. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో.. అవసరమైతే సచ్చుడో తేలుద్దాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. అంతకుముందు కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి నిధుల కోసం ఢిల్లీలో సీఎం రేవంత్‌తో సహా క్యాబినెట్‌తో ఆమరణ దీక్ష చేయాలని సవాల్‌ విసిరారు. దానికి తమ మద్దతు ఉంటుందన్నారు. నిధులు తెచ్చుడో... కేబినెట్‌ సచ్చుడోనని వ్యాఖ్యానించారు. కాగా, ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ధర్నా నిర్వహిస్తే బీఆర్‌ఎస్‌ మద్దతిస్తుందని హరీశ్‌రావు అన్నారు. అగ్గిపెట్టె దొ రకలేదా? అని సీఎం అనడం ఎంతవరకు సమంజసం? ఉద్యమకారులపైకి రైఫిల్‌ పట్టుకుని వెళ్లి, రైఫిల్‌రెడ్డిగా పేరు తెచ్చుకుంది మీరు కాదా? అని ప్రశ్నించారు.

Updated Date - Jul 25 , 2024 | 02:57 AM

Advertising
Advertising
<