ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్‌కు షాక్..

ABN, Publish Date - Dec 05 , 2024 | 03:44 PM

Telangana: తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు బిగ్ షాక్ తలిగింది. ఆ పార్టీలకు చెందిన ముఖ్య నేతలిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకరు మాజీ ఎంపీ అయితే.. మరొకరు మాజీ ఎమ్మెల్యే. మరి కాంగ్రెస్‌లో చేరిన వీరిద్దరు ఎవరో తెలియాలంటే పూర్తి కథనం చదవాల్సిందే..

హైదరాబాద్, డిసెంబర్ 05: తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేతలు. ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలు గురువారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ సోయం బాబురావు, బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మహేష్ గౌడ్.


ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. చేరికల అంశంపై హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరుతామంటూ సంప్రదింపులు చేస్తున్నారని తెలిపారు. శుభ ముహూర్తం చూసుకుని కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారని మహేష్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం అని చెప్పిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఫిరాయింపులకు, ఇప్పటి ఫిరాయింపులకు తేడా ఉందన్నారు. నాడు కేసీఆర్‌కి పూర్తి మెజార్టీ ఇచ్చినా ఫిరాయింపులు చేశారని విమర్శించారు. ప్రభుత్వాన్ని పడగొడుతాం అంటే బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు తమ పార్టీలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలన పట్ల ఆకర్షితులవుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.


ఇదే సమయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు అరెస్ట్‌పై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే కుదరని చెప్పారు. తాము ఎన్నో సార్లు గృహ నిర్బంధాలకు గురయ్యామన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో నిర్బంధం ఎలా ఉండేదో హరీష్ రావు గుర్తు చేసుకోవాలని సూచించారు. అడ్డమైన బాష మాట్లాడుతాం.. అధికారులను తిడుతామంటే చట్టం తన పని తాను చేసుకొని పోతుందన్నారాయన. నిరసన తెలిపే హక్కును అడ్డుకోబోమన్నారు. హరీష్ రావు నానా యాగీ చేయాల్సిన అవసరం ఏముందని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ ఇప్పటికైనా ఆ పార్టీ అల్లరి మూకలను కంట్రోల్ చేయాలని హితవు చెప్పారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.


సోయం బాబురావు, ఆత్రం సక్కు కామెంట్స్..

ఈ సందర్భంగా సోయం బాబురావు మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి తన అభిమాన నాయకుడు అని చెప్పారు. పదేళ్లలో పరిష్కారం కాని సమస్యలన్నింటినీ రేవంత్ రెడ్డి పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీపై తాను చేసిన విమర్శలకు చింతిస్తున్నానని బాబురావు ప్రకటించారు. ఇక ఆత్రం సక్కు మాట్లాడుతూ.. ఆదివాసీల సంరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. మైదాన ప్రాంతంతో పాటు.. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుందని, అందుకే పార్టీలోకి చేరుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను గడపగడపకి తీసుకెళ్తానని చెప్పారు.


Also Read:

అభిషేక్ ఊచకోత.. పిచ్చకొట్టుడు కొట్టాడు

ఆ లెటర్‌‌పై బన్ని ఎమోషనల్ పోస్ట్..

సిక్సుల వర్షం కురిపించిన అక్షర్

For More Telangana News and Telugu News..

Updated Date - Dec 05 , 2024 | 03:51 PM