Share News

Loksabha: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ భారీ అంచనాలు

ABN , Publish Date - Jun 03 , 2024 | 10:42 AM

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది. రేపే లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు కమలం పార్టీ ట్రైనింగ్ ఇచ్చింది. కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచనలు చేస్తున్నారు. డబుల్ డిజిట్ స్థానాలను దక్కించుకుంటామని బీజేపీ ధీమాలో ఉంది.

Loksabha: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ భారీ అంచనాలు

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది. రేపే లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు కమలం పార్టీ ట్రైనింగ్ ఇచ్చింది. కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచనలు చేస్తున్నారు. డబుల్ డిజిట్ స్థానాలను దక్కించుకుంటామని బీజేపీ ధీమాలో ఉంది. తెలంగాణ బీజేపీలో ఎగ్జిట్ పోల్స్ ఉత్సాహం నింపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 20 శాతం ఓట్లతో బీజేపీ 4 స్థానాలు గెలిచింది. సిట్టింగ్ స్థానాలతో పాటు.. మరో అరడజను సీట్లను గెలుచుకుంటామని బీజేపీ తెలిపింది. సిట్టింగ్ స్థానాలతో పాటు.. అదనంగా ఒక్క స్థానం గెలిచినా తమకు బోనసేనని బీజేపీ చెబుతోంది.

Supreme Court: పోస్టల్ బ్యాలెట్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ


రేపు ఎన్నికల కౌంటింగ్ కావడంతో పార్టీల్లో తీవ్ర టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ కంటే ముందు ఉంటామా.. లేదా? అన్న టెన్షన్‌లో బీజేపీ.. ఎక్కడ బీజేపీ ముందుకెళుతుందోనన్న టెన్షన్‌లో కాంగ్రెస్ పార్టీలున్నాయి. సర్వేలు కూడా కాస్త బీజేపీకే అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ ప్రారంభమైంది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉంటుందని సర్వేలు చెప్పడం ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామం. పైగా ప్రభుత్వంపై పల్లెల్లో వ్యతిరేకత ప్రారంభమైందన్న వార్తలు సైతం ఆ పార్టీని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

ప.గో. జిల్లాలో కూటమి పంజా విసరనుందా?

అధికారులకు సీఈసీ కీలక ఆదేశాలు..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 03 , 2024 | 10:42 AM