ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Musi River: పెట్టుబడులంటే హైదరాబాద్‌ అనేలా మూసీ అభివృద్ధి చేపడతాం

ABN, Publish Date - Aug 02 , 2024 | 03:11 AM

మూసీ నది అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీనది అభివృద్ధి ప్రాజెక్టుతో.. ఇక పెట్టుబడులంటే హైదరాబాద్‌ గుర్తొచ్చేలా చేస్తామని ప్రకటించారు.

  • హైదరాబాద్‌ 4.0 అభివృద్ధికి ప్రణాళికల రూపకల్పన

  • ‘రీ ఇమాజినింగ్‌ హైదరాబాద్‌’లో సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): మూసీ నది అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీనది అభివృద్ధి ప్రాజెక్టుతో.. ఇక పెట్టుబడులంటే హైదరాబాద్‌ గుర్తొచ్చేలా చేస్తామని ప్రకటించారు. మూసీలో శుద్ధ జలాల ప్రవాహం ఉండేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. క్రెడాయ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో గురువారం సాయంత్రం జరిగిన ‘రీ ఇమాజినింగ్‌ హైదరాబాద్‌’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. పాలకులు మారినా.. చారిత్రక హైదరాబాద్‌ అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలను కొనసాగించారని, అందుకే హైదరాబాద్‌కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. 1965లో నాటి పాలకులు తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే ఫార్మా రంగంలో హైదరాబాద్‌ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.


25ఏళ్ల క్రితం గచ్చిబౌలి అటవీ ప్రాంతమని, అలాంటిది హైదరాబాద్‌లో ఉన్నామా? ఇంకెక్కడైనా ఉన్నామా?అనే స్థాయిలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని తెలిపారు. బ్యాగరి కంచెలో స్కిల్‌ వర్సిటీకి శంకుస్థాపన చేశామని, ఆ ప్రాంతం పేరు పలికేందుకు ప్రస్తుతం కొందరు ఇబ్బంది పడొచ్చు కానీ నాలుగైదేళ్లలో బ్యాగరికంచె గురించి గొప్పగా చెప్పుకునేలా చేస్తామన్నారు. హైదరాబాద్‌ 4.0 అభివృద్థికి ప్రణాళికలు రచిస్తున్నామని, మరో ఏడాదిలోగా మాస్టర్‌ప్లాన్‌ 2050 అందుబాటులోకి రాబోతుందన్నారు. సిద్ధాంతపరంగా కొందరితో విభేదాలున్నా అభివృద్ధి అంశంలో ప్రభుత్వానికి ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవన్నారు. బిల్డర్లు రాజకీయ నాయకులుగా మారితే.. వారిని ప్రత్యర్థులుగానే చూస్తామని సీఎం చెప్పారు. కేవలం వ్యాపారాలు చేసే వారికే ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2024 | 03:11 AM

Advertising
Advertising
<