ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budget cuts: ఢిల్లీ నిరసనల్లో టీ కాంగ్రెస్‌ ఎంపీలు

ABN, Publish Date - Jul 25 , 2024 | 04:37 AM

కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తీరును నిరసిస్తూ పార్లమెంట్‌ ఆవరణలో ఇండియా కూటమి చేపట్టిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పాల్గొన్నారు.

  • కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆగ్రహం

  • తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారంటూ నినాదాలు

న్యూఢిల్లీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తీరును నిరసిస్తూ పార్లమెంట్‌ ఆవరణలో ఇండియా కూటమి చేపట్టిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పాల్గొన్నారు. లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అఖిలేష్‌ యాదవ్‌ పాల్గొన్న ఈ నిరసనలో.. బడ్జెట్‌ను ఏకపక్షంగా రూపొందించారని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, కడియం కావ్య, మల్లు రవి, సురేశ్‌ షెట్కార్‌, బలరాంనాయక్‌, రఘువీర్‌రెడ్డి, రఘురామిరెడ్డి ‘గాడిద గుడ్డు’ ప్లకార్డుతో తమ నిరసన వ్యక్తం చేశారు. 8 మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ద్రోహి మోదీ అని, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను విస్మరించారని, నిధుల కేటాయింపులో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని విమర్శించారు.

Updated Date - Jul 25 , 2024 | 04:37 AM

Advertising
Advertising
<