ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Scam: స్టాక్‌ మార్కెట్‌ పేరుతో నమ్మించి.. రూ. 5 కోట్లు దోచేసి

ABN, Publish Date - Sep 19 , 2024 | 04:44 AM

స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి రూ. 5.27 కోట్లు మోసం చేసిన కేటుగాన్ని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) పోలీసులు అరెస్టు చేశారు.

  • కేటుగాడిని అరెస్టు చేసిన సీఎస్‌బీ పోలీసులు

  • పెట్టుబడుల పేరుతో వచ్చే సోషల్‌ మీడియా ప్రకటనలు నమ్మొద్దు: శిఖాగోయల్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి రూ. 5.27 కోట్లు మోసం చేసిన కేటుగాన్ని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో వచ్చిన బిజినెస్‌ ప్రమోషన్‌ లింక్‌తో హైదరాబాద్‌కు చెందిన బాధితుడు ‘ఏ117 ఐఐఎ్‌ఫఎల్‌ సెక్యూరిటీస్‌ ఆఫీషియల్‌ స్టాక్‌ కమిటీ’ అనే వాట్సాప్‌ గ్రూప్‌లో చేరాడు. అంకుర్‌ కేడియా ఆ గ్రూప్‌ సీఈవోగా పరిచయం చేసుకుని స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తాల్లో లాభాలు వస్తాయని నమ్మించాడు. .


రెండు దఫాల్లో రూ. 5.27 కోట్లు కేటుగాడు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో బాధితుడు జమచేశాడు. లాభాలు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సీఎ్‌సబీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన అధికారుల బృందం.. నిందితుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన సైదుల్‌ ఇస్లామ్‌ ఖాన్‌గా గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. పెట్టుబడుల పేరుతో సోషల్‌ మీడియాలో వచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని సీఎ్‌సబీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌ ఓ ప్రకటనలో తెలిపారు

Updated Date - Sep 19 , 2024 | 04:44 AM

Advertising
Advertising