ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Diagnostics: డయాగ్నస్టిక్‌ హబ్‌లకు జబ్బు!

ABN, Publish Date - May 20 , 2024 | 05:29 AM

రాష్ట్రంలో నిరుపేదలకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటైన తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ హబ్‌లకు జబ్బు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వీటి పనితీరు అస్తవ్యస్తంగా మారింది. వీటిలో పనిచేసేందుకు తగినంత మంది రెగ్యులర్‌ సిబ్బంది లేకపోవడం ఒక సమస్య అయితే, ఉన్నవారికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం మరో సమస్యగా ఉంది. ప్రస్తుతం ఈ హబ్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి ఐదారు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో.. కొందరు ఉద్యోగాలు వదిలేస్తున్నారు. వైద్యులు సైతం ఇదే బాట పడుతున్నారు.

  • సిబ్బందికి 6 నెలలుగా జీతాల్లేవ్‌

  • ఉద్యోగాలు మానేస్తున్న సిబ్బంది, వైద్యులు

  • 104 సేవల నుంచి హబ్‌లకు సిబ్బంది

  • వేతన సొమ్మును ఏజెన్సీలకిస్తున్న సర్కారు

  • సిబ్బందికి చెల్లించకుండా తమ ఖాతాల్లోనే

  • నెలల తరబడి ఉంచుకుంటున్న ఏజెన్సీలు

  • హబ్‌లలో నిపుణులైన సిబ్బంది కొరత

  • తగినంత మంది రేడియాలజిస్టులు లేక

  • రేడియోగ్రాఫర్ల వద్దకే టెస్టుల రిపోర్టులు

  • క్వాలిటీ కంట్రోల్‌ కూడా సరిగా లేని వైనం

  • మెషీన్లు పాడైతే మరమ్మతులూ కరువు

హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిరుపేదలకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటైన తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ హబ్‌లకు జబ్బు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వీటి పనితీరు అస్తవ్యస్తంగా మారింది. వీటిలో పనిచేసేందుకు తగినంత మంది రెగ్యులర్‌ సిబ్బంది లేకపోవడం ఒక సమస్య అయితే, ఉన్నవారికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం మరో సమస్యగా ఉంది. ప్రస్తుతం ఈ హబ్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి ఐదారు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో.. కొందరు ఉద్యోగాలు వదిలేస్తున్నారు. వైద్యులు సైతం ఇదే బాట పడుతున్నారు. దీనికితోడు డయాగ్నస్టిక్స్‌ హబ్‌లలో క్వాలిటీ కంట్రోల్‌ కూడా సరిగా ఉండటం లేదని, రోగుల రిపోర్టులు సరిగా రావడంలేదనే ఆరోపణలున్నాయి. మెషిన్లు పాడైతే సకాలంలో మరమ్మతు కూడా చేయించడం లేదని అంటున్నారు.


జాతీయ వైద్య ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) పథకంలో భాగంగా తెలంగాణలో డయాగ్నస్టిక్స్‌ హబ్‌ల సేవలు 2018 జనవరిలో ప్రారంభమయ్యాయి. తొలుత హైదరాబాద్‌కే పరిమితమైన ఈసేవలను.. ఆ తరువాత అన్ని జిల్లాలకు విస్తరించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్స్‌ హబ్‌లు ఉన్నాయి. వీటిలో రక్త, మూత్ర పరీక్షలకు సంబంఽధించిన 134 రకాల టెస్టులు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. కొత్తగా ఏర్పాటైన చోట మాత్రం 57 రకాల పరీక్షలే చేస్తున్నారు. కాగా, డయాగ్నస్టిక్స్‌ హబ్‌లలో ల్యాబ్‌ టెక్నీషియన్లు (ఎల్టీ), ల్యాబ్‌ అటెండర్‌, రేడియోగ్రాఫర్‌తోపాటు ల్యాబ్‌ మేనేజర్‌ ఉంటారు. వీరితోపాటు డాక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, శానిటేషన్‌ సిబ్బంది కూడా ఉన్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి డిప్యుటేషన్‌పై పంపించారు. ఈ హబ్‌ల సేవలు పెరగడంతో మరికొందరిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. అలాగే 104 వాహన సేవలను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విరమించుకోవడంతో.. వాటిలో పనిచేసే ఎల్టీలు, ల్యాబ్‌ అటెండర్లు అందరినీ డయాగ్నస్టిక్స్‌ హబ్‌లకు పంపించారు. ఇలా సుమారు ఐదారు వందల మంది సిబ్బంది 104 వాహన సేవల నుంచి వచ్చారు. ఈ హబ్‌లలో అవకాశం లేనివారిని ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించారు.


వేతనాలు ఇవ్వకపోవడంతో..

104 వాహన సేవల సిబ్బందికి వేతనాలను గతంలో వాటి నిర్వహణ సంస్థ ఇచ్చేది. వీరు అక్కడి నుంచి డయాగ్నస్టిక్స్‌ హబ్‌లకు రావడంతో అందరూ ఆయా జిల్లాల పరిఽధిలోని ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ కిందకు వచ్చారు. ఆ ఏజెన్సీలే వీరందరికీ జీతాలిస్తున్నాయి. అయితే గత ఐదారు నెలలుగా సదరు ఏజెన్సీలు వీరికి వేతనాలివ్వడం ఆపేశాయి. దాంతో డయాగ్నస్టిక్స్‌ హబ్‌లలో పనిచేస్తున్న వారిలో కొందరు ఉద్యోగాలు మానేస్తున్నారు. గతేడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు జీతాలు రాలేదని, ఇలాగైతే కుటుంబం గడవడం కూడా కష్టమని ములుగు జిల్లాలో పనిచేసే ఓ రేడియోగ్రాఫర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. సర్కారు నుంచి రూ.కోట్ల నిధులు విడుదలైనప్పటికీ కొన్ని మ్యాన్‌పవర్‌ ఏజెన్సీలు ఆ డబ్బులను ఉద్యోగులకు చెల్లించడం లేదు. వచ్చిన నిధుల్ని బ్యాంకుల్లోనే డిపాజిట్లుగా ఉంచేస్తున్నారని, దాంతో వాటికి నాలుగైదు నెలకు పెద్దమొత్తంలో బ్యాంకు వడ్డీ ఇస్తుందని, ఇటువంటి సంఘటనలు కొన్ని జిల్లాల్లో జరిగాయని ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాకుండా.. డయాగ్నస్టిక్స్‌ హబ్‌లలో పనిచేసే సిబ్బంది వేతానాల్లో భారీగా వ్యత్యాసం ఉంటోంది. కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన ఎల్టీలకు రూ.27 వేల వరకు వేతనం ఉంది. 104 వాహనాల నుంచి వచ్చిన ఎల్టీలకు మాత్రం కేవలం రూ.22,750 మాత్రమే ఇస్తున్నారు. ఇందులో వివిధ కటింగ్‌లు పోను.. బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది కేవలం రూ.20 వేలేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అస్తవ్యస్తంగా హబ్‌లు

డయాగ్నస్టిక్స్‌ మాన్యువల్‌ ప్రకారం.. ప్రతి హబ్‌లోనూ పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, రేడియాలజీ విభాగాలకు వైద్యులు ఉండాలి. కానీ, రాష్ట్రవ్యాప్తంగా డయాగ్నస్టిక్స్‌ హబ్‌లలో ఈ వైద్యులందరూ లేరన్నది బహిరంగ రహస్యం. చాలా చోట్ల పాథాలజిస్టులతోనే నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. అలాగే రేడియాలజిస్టులు కూడా చాలా తక్కువ మంది ఉంటున్నారు. దాంతో అందుకు సంబంధించిన రిపోర్టులను రేడియోగ్రాఫర్లే చూస్తున్నారు. డయాగ్నస్టిక్స్‌ హబ్‌లలో ఎల్టీలు మెషిన్లపై పరీక్షలు చేసిన అనంతరం.. ఆ రిపోర్టులను వైద్యులకు చూపించి వారితో ధ్రువీకరించుకోవాలి. కానీ, ప్రస్తుతం ఎక్కువ హబ్‌లలో సంబంధిత వైద్యులు లేరు. ఎంఎల్‌టీ (మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ) డిప్లొమా చేస్తున్న విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ కోసం హబ్‌లకు వస్తుండటంతో వారితోనే రిపోర్టులను మమ అనిపించేస్తున్నారు. మరోవైపు.. ఉన్నవారికి సరిగా వేతనాలివ్వకపోవడంతో కొందరు మానేస్తుండగా, మరికొందరు మెడికల్‌ కాలేజీలు, జనరల్‌ ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. డయాగ్నస్టిక్స్‌ హబ్‌లలో పరీక్షలు జరిపే విషయానికి వస్తే.. తొలుత క్షేత్రస్థాయిలోనిపీహెచ్‌సీల్లో రోగుల రక్త, మూత్ర నమూనాలు సేకరిస్తారు. రోగి ఆధార్‌ కార్డు ఆధారంగా ఒక రిజిస్టర్‌ నంబరు జనరేట్‌ చేస్తారు. కంప్యూటర్‌ సిస్టమ్‌ ద్వారా బార్‌కోడ్‌ తీసి శాంపిల్స్‌పై వేసి, డయాగ్నస్టిక్స్‌ హబ్‌లకు పంపుతారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ, ప్రస్తుతం సర్వర్‌ డౌన్‌ సమస్య కారణంగా అత్యధిక పీహెచ్‌సీల్లో ఉదయం వేళ సకాలంలో బార్‌కోడ్‌ జనరేట్‌ చేయడం లేదని అంటున్నారు. సర్వర్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇక హబ్‌లో క్వాలిటీ కంట్రోల్‌ కూడా సరిగా ఉండటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో రోగుల రిపోర్టులు సరిగా ఉండటం లేదని, బయట ప్రైవేటు ల్యాబ్‌లలో చేసే రిపోర్టులకు, డయాగ్నస్టిక్స్‌ హబ్‌ రిపోర్టులకు మధ్య వ్యత్యాసం కొన్నిసార్లు ఎక్కువగా ఉంటోందని రోగులు చెబుతున్నారు.


శ్రమ దోపిడీ చేస్తున్నారు

మమ్మల్ని 104 నుంచి డయాగ్నస్టిక్స్‌ హబ్‌కు పంపారు. అయితే కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాల్సి ఉండగా ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలకు అప్పగించారు. దాంతో గతేడాది డిసెంబరు నుంచి వేతనాలు సరిగా రావడం లేదు. సెలవులు కూడా ఇవ్వడం లేదు. శ్రమదోపిడీకి గురవుతున్నాం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నారు. మాకు కూడా ప్రతినెలా మొదటివారంలో జీతాలివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే తీవ్ర అప్పుల్లో కూరుకుపోయి.. కుటుంబాన్ని కూడా నడపలేని పరిస్థితికి వచ్చాం.

Updated Date - May 20 , 2024 | 05:29 AM

Advertising
Advertising