ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kohir: గజ..గజ..

ABN, Publish Date - Nov 21 , 2024 | 04:29 AM

తెలంగాణలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో రాష్ట్రంలోనే కనిష్ఠ ఉష్ణోగ్రత 9.0గా నమోదైంది.

  • కోహీర్‌లో 9 డిగ్రీలకు పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): తెలంగాణలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో రాష్ట్రంలోనే కనిష్ఠ ఉష్ణోగ్రత 9.0గా నమోదైంది. గత వారం రోజులుగా రాత్రి పూట ఉష్టోగ్రతలు క్రమేపీ పడిపోతుండగా రాగల మూడు రోజుల పాటు చలి తీవ్రత మరింత ఉండనుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అటు చలిగాలులకు హైదరాబాద్‌ ప్రజలు వణికిపోతున్నారు. తెల్లవారుజామున పొగమంచు రహదారులను కప్పేయడంతో వాహనదారులు ముందుకు వెళ్లడం కష్టంగా మారింది.


ముఖ్యంగా కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగత్రలు మరింతగా పడిపోతున్నాయి. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో గరిష్ఠం- 29.2, కనిష్ఠ 15.1డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పటాన్‌చెరులో అత్యల్పంగా 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా రాజేంద్రనగర్‌లో 13 డిగ్రీలు, హయత్‌నగర్‌లో 14.6, బేగంపేటలో 15.1, దుండిగల్‌, హకీంపేట ప్రాంతాల్లో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూరు(యు) మండలంలో 9.7డిగ్రీల ఉష్ణోగ్రత, మంచిర్యాల జిల్లాలో 12.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో చలితీవ్రతను తట్టుకునేందుకు గ్రామాల్లోని ప్రజలు చలిమంటలు ఏర్పాటు చేసుకుంటున్నారు. చలి తీవ్రతకు సంబంధించి రాగల 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 33 జిల్లాకు గాను ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.


మంగళవారం రాత్రి నమోదైన ఉష్ణోగ్రతలు

జిల్లా మండలం కనిష్ఠ

ఉష్ణోగ్రతలు

సంగారెడ్డి కోహీర్‌ 9

ఆసిఫాబాద్‌ సిర్పూర్‌ 9.7

వికారాబాద్‌ మర్పల్లి 10.6

రంగారెడ్డి షాబాద్‌ 11

సిద్దిపేట మర్కుక్‌ 11.1

Updated Date - Nov 21 , 2024 | 04:29 AM