ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Damodara Rajnarsimha: క్షయ నిర్మూలనకు ప్రత్యేకకార్యక్రమం

ABN, Publish Date - Dec 22 , 2024 | 05:03 AM

దేశంలో 2025 చివరి నాటికి క్షయ (టీబీ)ని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

  • 9 జిల్లాల్లో వంద రోజుల పాటు నిర్వహణ

  • 26 సంచార పరీక్ష ల్యాబ్‌ల ఏర్పాటు

  • మంత్రి దామోదర రాజనర్సింహ

  • కేంద్రమంత్రి నిర్వహించిన వీసీలో వెల్లడించిన మంత్రి

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : దేశంలో 2025 చివరి నాటికి క్షయ (టీబీ)ని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో క్షయ నిర్మూలనకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించిన అన్ని రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ‘టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌’పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి దామోదర రాజ నర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీన 9 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ 9 జిల్లాల్లో క్షయ సోకే అవకాశం ఉన్న ప్రజలను గుర్తించి పరీక్షలు చేసేందుకు 26 సంచార పరీక్ష వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని వాహనాల్లోనూ డిజిటల్‌ ఎక్స్‌రేమిషన్లు, సీబీ నాట్‌ మిషన్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. వంద రోజుల కార్యక్రమానికి సరిపడా టెస్టింగ్‌ రీ ఏజెంట్లు, మందులు అందుబాటులో ఉంచామని చెప్పారు. 9 జిల్లాల్లో కలిపి ఇప్పటి వరకూ 7,219 మందికి పరీక్షలు చేశామన్నారు.


అందులో 181 మందికి క్షయ ఉందని(టీబీ పాజిటివ్‌) తేలినట్లు కేంద్ర మంత్రికి దామోదర వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించడం, ముందస్తు పరీక్షల ద్వారానే క్షయ నిర్మూలన సాధ్యమవుతుందని మంత్రి దామోదర అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పరీక్షల సంఖ్యను భారీగా పెంచామన్నారు. 2023లో 5.74 లక్షల మందికి క్షయ పరీక్షలు చేయగా... 2024లో 7.82 లక్షల మందికి చేశామన్నారు. చికిత్స సఫలత రేటు దేశంలో సగటున 87 శాతం ఉంటే తెలంగాణలో 90 శాతం ఉందన్నారు. కాగా క్షయ రోగుల గుర్తింపు, చికిత్స కోసం 100 రోజుల ‘ఇంటెన్సిఫైడ్‌’ క్షయ నిర్మూలన కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. గతేడాది తక్కువ పరీక్షలు జరిగిన జిల్లాలను, క్షయ ప్రమాదం ఎక్కువగా ఉన్న జిల్లాలను ఈ కార్యక్రమం కోసం కేంద్రం ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 347 జిల్లాల్లో(తెలంగాణలో 9 జిల్లాలు) ఈ నెల 7న కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2025 మార్చి 17 వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా క్షయ వచ్చే అవకాశం ఉన్న ప్రజలను గుర్తించి, పరీక్షలు చేయాల్సి ఉంటుంది. దీనికోసమే రాష్ట్ర ప్రభుత్వం 26 సంచార పరీక్ష(మొబైల్‌ స్ర్కీనింగ్‌) వాహనాలను ఏర్పాటు చేసింది.

Updated Date - Dec 22 , 2024 | 05:03 AM