Telangana: నీటిపారుదల రంగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ABN, Publish Date - Aug 07 , 2024 | 06:22 PM
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీటి పారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డి చైర్మన్‌గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరులు, నది అభివృద్ధి&గంగా పునరుజ్జీవన శాఖ, జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను స్వీకరించడం, మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహణ కోసం..
హైదరాబాద్, ఆగష్టు 07: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీటి పారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డి చైర్మన్‌గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరులు, నది అభివృద్ధి&గంగా పునరుజ్జీవన శాఖ, జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను స్వీకరించడం, మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహణ కోసం జాతీయ ఫ్రేమ్ వర్క్‌పై పద్ధతులు, మార్గదర్శకాలను అధ్యయనం చేయడానికి, సిఫారసు చేయడానికి ఈ కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతేకాదు.. తెలంగాణలోని రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పునరుద్ధరణ కోసం మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు.
కమిటీలో సభ్యులు వీరే..
తెలంగాణ నీటిపారుదల రంగా అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కేబినెట్ సబ్ కమిటీలో.. మంత్రులు సహా అధికారులు సభ్యులుగా ఉన్నారు. పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఐ అండ్ సీఏడీ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నీటిపారుల రంగంపై ఈ కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసి సిఫారసు చేయనుంది.
ఆగష్టు 9న తొలి భేటీ..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీటిపారుదల శాఖ మంత్రివర్గ ఉప సంఘం ఆగష్టు 9వ తేదీన సమావేశం కానుంది. రాష్ట్రంలోని జలాశయాలు.. వాటి పరిస్థితి, పుణరుద్దరణ అంశాలపై పరిశీలన చేసి సిఫారసులు చేయనుంది. కేంద్ర జల వనరుల శాఖ సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు తొలి సమావేశం నిర్వహించనున్నారు.
Also Read:
సతీమణి భువనేశ్వరి సీఎం గిఫ్ట్.. ఏం ఇచ్చారో తెలుసా..?
ఫోగట్‌పై కుట్ర జరిగిందా.?
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్ట్ కీలక
For More Telangana News and Telugu News..
Updated Date - Aug 07 , 2024 | 06:22 PM