ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budget: మూలధన వ్యయం తగ్గింది!

ABN, Publish Date - Sep 28 , 2024 | 04:39 AM

మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం వెచ్చించే మూలధన వ్యయం తగ్గిపోతోంది. గత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టిన ఖర్చు భారీగా తగ్గడం గమనార్హం.

  • నిరుటి కంటే రూ.10 వేల కోట్లు తక్కువ

  • ఐదు నెలల్లో ఖర్చు పెట్టింది రూ.8,327 కోట్లే

  • 5 నెలల్లో రాష్ట్ర రాబడులు రూ.61,618 కోట్లు

  • అప్పుల రూపంలో మరో 29,449 కోట్ల రాక

  • రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం 85,467 కోట్లు

  • ఆగస్టు ఆదాయ, వ్యయాలపై ‘కాగ్‌’ నివేదిక

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం వెచ్చించే మూలధన వ్యయం తగ్గిపోతోంది. గత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టిన ఖర్చు భారీగా తగ్గడం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి మూలధన వ్యయం కింద ప్రభుత్వం రూ.18,432 కోట్లు ఖర్చు చేసింది. అప్పటి బడ్జెట్‌లో అంచనా వేసిన రూ.37,524 కోట్లలో ఇది 49.12 శాతంగా నమోదైంది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు నాటికి 5 నెలల్లో కేవలం రూ.8,327 కోట్లే ఖర్చు చేయగలిగింది. ఇది అంచనా వేసిన రూ.33,486 కోట్లలో 24.87 శాతమే. గత ఏడాది కంటే ఈసారి రూ.10 వేల కోట్ల వరకు తక్కువగా ఖర్చు చేసింది.


ఈ వివరాలను కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) శుక్రవారం విడుదల చేసిన ఆగస్టు నెల ఆదాయ వ్యయాల నివేదికలో వెల్లడించింది. సాధారణంగా మూలధన వ్యయం కింద సాగునీటి ప్రాజెక్టులు, భవనాలు, రోడ్ల నిర్మాణం వంటి వాటి కోసం నిధులు కేటాయిస్తారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై కాస్త వ్యయం తగ్గించడంతో మూలధన వ్యయంలో వృద్ధి నమోదు కావడం లేదు. ఇక స్టాంపులు-రిజిస్ట్రేషన్ల కింద రాబడి పెరగడం గమనార్హం. గత ఏడాది ఇదే ఐదు నెలల కాలానికి స్టాంపులు-రిజిస్ట్రేషన్ల కింద రూ.5,852 కోట్లు వచ్చాయి. అప్పట్లో అంచనా వేసిన రూ.18,500 కోట్లలో ఇది 31.63 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే పద్దు కింద రూ.18,228 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. ఆగస్టు నాటికి రూ.6,390 కోట్లు సమకూరాయి. ఇది 35 శాతంగా నమోదైంది.


  • ఆగస్టు నాటికి రాబడులు ఇలా..

ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఐదు నెలల్లో రాష్ట్ర రెవెన్యూ రాబడుల కింద రూ.61,618 కోట్లు సమకూరాయి. అంచనా వేసిన మొత్తం రాబడులు రూ.2,21,242 కోట్లలో ఇది 27.85 శాతం. ఈ రెవెన్యూ రాబడుల్లో పన్ను ఆదాయం కింద రూ.1,64,397 కోట్లను అంచనా వేయగా... రూ.57,722 కోట్లు(35.11ు) సమకూరాయి. పన్నేతర రాబడి కింద రూ.1,449 కోట్లు, కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద రూ.2,447 కోట్లు వచ్చాయి. ఇక మూలధన రాబడి కింద మొత్తం రూ.52,815 కోట్లను అంచనా వేయగా.. రూ.29,466 కోట్లు సమకూరాయి.


ఇందులో అప్పుల రూపంలో రూ.49,255 కోట్లను అంచనా వేయగా.. ఆగస్టు నాటికి రూ.29,449 కోట్లు(59.79ు) వచ్చాయి. అంటే... లక్షిత అప్పులో ఐదు నెలల్లోనే 60 శాతం మేర అప్పులు తీసుకున్నట్లయింది. ఇలా రెవెన్యూ, మూలధన రాబడుల కింద మొత్తం రూ.91,085 కోట్లు వచ్చాయి. ఇది ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన రూ.2,74,057 కోట్లలో 33.24 శాతం కావడం గమనార్హం. కాగా, ఆగస్టు నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.85,467 కోట్ల(33.59ు)ను ఖర్చు చేసింది.

Updated Date - Sep 28 , 2024 | 04:39 AM