ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

ABN, Publish Date - Sep 04 , 2024 | 06:49 PM

సెప్టెంబర్ 7, 17వ తేదీలను సెలవు దినాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం ప్రభుత్వం జారీ చేసింది. గణేష్ చతుర్థి, మిలాద్ ఉన్ నబీ పండుగలకు పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

హైదరాబాద్, సెప్టెంబర్ 04: సెప్టెంబర్ 7, 17వ తేదీలను సెలవు దినాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం ప్రభుత్వం జారీ చేసింది. గణేష్ చతుర్థి, మిలాద్ ఉన్ నబీ పండుగలకు పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి. సెప్టెంబర్ 17వ తేదీ మిలాద్ ఉన్ నబీ నేపథ్యంలో సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Minister Thummala: ప్రాణ నష్టం జరగకుండా మున్నేరు గండం గడిచింది


తెలంగాణలో సాధారణ సెలవుల క్యాలెండర్ ప్రకారం.. 7వ తేదీ గణేష్ చతుర్థి, సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీకి సెలవులుగా గతంలో నిర్ణయించారు. కానీ నెలవంక దర్శనం తేదీని బట్టి మిలాద్ ఉన్ నబీ సెలవు దినం మార్చినట్లు తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తొలుత నిర్ణయించిన 16వ తేదీన కాకుండా.. 17వ తేదీని మిలాద్ ఉన్ నబీ సెలవు దినంగా రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా ప్రకటించింది.


మరోవైపు సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 17వ తేదీన వినాయకుడి విగ్రహ నిమజ్జనం జరగనుంది. దాంతో వినాయక నిమజ్జనం ఊరేగింపు కారణంగా.. ఆ రోజు జరగాల్సిన మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ర్యాలీ వాయిదా పడే అవకాశమున్నట్లు సమాచారం. అయితే ఈ నెల 19వ తేదీ మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు జరిగే అవకాశముందని ఓ చర్చ సైతం సాగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తలు మరియు తెలుగు వార్తలు కోసం..

Updated Date - Sep 04 , 2024 | 06:52 PM

Advertising
Advertising