Share News

High Court: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు

ABN , Publish Date - Nov 19 , 2024 | 06:19 PM

కాంట్రాక్ట్ ఉద్యోగులను గత ప్రభుత్వం క్రమబద్దీకరించడంపై నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో ఈ అంశంపై మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించింది.

High Court: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్, నవంబర్ 19: ఇప్పటికే రెగ్యులర్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు తొలగించ వద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ముందు భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం నిర్వహించాలని హైకోర్టు తన ఆదేశాల్లో వెల్లడించింది. నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ కాకుండా నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయాలని తన ఆదేశాల్లో హైకోర్టు పేర్కొంది.

Also Read: Sabarimala: శబరిమలకు వెళ్తున్నారా.. వాటితో జాగ్రత్త

Also Read: KTR: రేవంత్ సర్కార్‌‌కి ప్రశ్నలు సంధించిన కేటీఆర్


కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని నిరుద్యోగులు హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు పైవిధంగా స్పందించింది. గతంలో 5,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జీవో 16లోని సెక్షన్ 10ఏ ద్వారా రెగ్యులరైజ్ చేయడాన్ని సైతం ఈ సందర్భంగా హైకోర్టు తప్పు పట్టింది.

Also Read: దబ్బ పండు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?

Also Read: Maharashtra Elections: పోలింగ్ వేళ.. చిక్కుల్లో బీజేపీ


రాష్ట్రంలో మొత్తం 40 విభాగాల్లో ఉన్న 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను గత ప్రభుత్వం క్రమబద్దీకరించింది. వారిలో దాదాపు 3 వేల మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది ఒకేషనల్ లెక్చరర్లు, 390 మంది పాలిటెక్నిక్, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్య ఆరోగ్య శాఖలో 837 మంది సహాయకులతోపాటు వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను సైతం గత ప్రభుత్వం క్రమబద్దీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తరహా నిర్ణయాల కారణంగా తమ భవిష్యత్తు దెబ్బ తింటుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందులోభాగంగా వారు హైకోర్టును ఆశ్రయించారు.

For Telangana News And Telugu News...

Updated Date - Nov 19 , 2024 | 06:26 PM