Gold Industry: రాష్ట్రంలో బంగారం, వెండి వస్తువుల.. పరిశ్రమను ఏర్పాటు చేయండి
ABN, Publish Date - Aug 19 , 2024 | 04:53 AM
బంగారం, వెండి వస్తువుల తయారీ పరిశ్రమలను తెలంగాణలో ఏర్పాటు చేసి తరతరాలుగా ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న స్వర్ణకారులకు,
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
2500 కోట్లతో తయారీ హబ్ ఏర్పాటు
లలితా జువెలరీస్ అధినేత కిరణ్
జీడిమెట్ల, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : బంగారం, వెండి వస్తువుల తయారీ పరిశ్రమలను తెలంగాణలో ఏర్పాటు చేసి తరతరాలుగా ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న స్వర్ణకారులకు, వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. జీడిమెట్ల సుచిత్ర ప్రాంతంలో లలితా జువెలరీ అధినేత కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 55వ షాపు ప్రారంభోత్సవానికి శ్రీధర్‌బాబు ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ లో బంగారు ఉత్పత్తుల తయారీ కంపెనీలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. లలితా జువెలరీ అధినేత కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో 2500 కోట్ల రూపాయల వ్యయంతో బంగారు వస్తువుల ఉత్పత్తి హబ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా మరో మూడు ప్రాంతాల్లో త్వరలోనే షోరూమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, సినీ నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు.
Updated Date - Aug 19 , 2024 | 04:53 AM