ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahakavi Dasarathi: మహబూబాబాద్‌ జిల్లాకు దాశరథి పేరు?

ABN, Publish Date - Jul 23 , 2024 | 04:15 AM

మలిదశ తెలంగాణ ఉద్యమానికి దాశరథి వంటి మహాకవుల సాహిత్యం ప్రధాన భూమికగా నిలిచిందని, ఆ వైతాళికుల స్ఫూర్తితో తాము స్వరాష్ట్ర సాధన కోసం చట్టసభల్లో, ప్రజా క్షేత్రంలో రాజీ లేని పోరాటాన్ని సాగించామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

  • శతజయంత్యుత్సవాలు ప్రారంభం

  • జూకంటి జగన్నాథంకు దాశరథి సాహితీ పురస్కారం

  • పాల్గొన్న మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్‌ తదితరులు

  • సాహిత్య స్ఫూర్తిపై చర్చాగోష్ఠులు నిర్వహించాలి: బండ ప్రకాష్‌

హైదరాబాద్‌ సిటీ, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : మలిదశ తెలంగాణ ఉద్యమానికి దాశరథి వంటి మహాకవుల సాహిత్యం ప్రధాన భూమికగా నిలిచిందని, ఆ వైతాళికుల స్ఫూర్తితో తాము స్వరాష్ట్ర సాధన కోసం చట్టసభల్లో, ప్రజా క్షేత్రంలో రాజీ లేని పోరాటాన్ని సాగించామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. పాట అత్యంత శక్తిమంతమైనదని, చైతన్యాన్ని రగిల్చి అందరినీ ఒక్క తాటిపైకి తేగల సత్తా కవులు, కళాకారులకే ఉందంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భాలను గుర్తుచేసుకున్నారు. రవీంద్ర భారతిలో మహాకవి దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సంవత్సరం సోమవారం మొదలైన సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన దాశరథి చిత్ర ప్రదర్శనను మంత్రులు ప్రారంభించారు. దాశరథి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రముఖ కవి జూకంటి జగన్నాథంకు దాశరథి సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు.


శాలువ, జ్ఞాపికతో సన్మానించి, రూ.1,01,116 నగదు చెక్కును అందించారు. సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మహబూబాబాద్‌ జిల్లాకు దాశరథి పేరు పెట్టేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఈ శతజయంతి సంవత్సరంలోనే ప్రకటించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. దాశరథి కుటుంబానికి తమ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని మంత్రి చెప్పారు. ఆయన పోరాట చైతన్య స్ఫూర్తిని తెలుగు వారంతా స్మరించుకునేలా ఈ ఏడాదంతా కార్యక్రమాలు నిర్వహించేందుకు భాషా సాంస్కృతిక శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ‘ఆ చల్లని సముద్ర గర్భం.’ పాటను ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుందని, దాని ఔచిత్యం ఈనాటికి ఉందని అన్నారు.


శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌ మాట్లాడుతూ దాశరథి సాహిత్యం- వ్యక్తిత్వంతో పాటు ఆ మహనీయుడి పోరాట జీవితంపై రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో, జిల్లా కేంద్రాల్లో చర్చాగోష్ఠులు నిర్వహించాలని భాషా సాంస్కృతిక శాఖకు సూచించారు. రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అవార్డు స్వీకర్త జూకంటి జగన్నాథం తెలంగాణ సాహిత్య అకాడమీ వంటి పదవితో గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో మానుకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల, భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్‌, డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, దాశరథి కుమార్తె ఇందిర, కుమారుడు లక్ష్మణ్‌ పాల్గొన్నారు. దాశరథి సొంతూరు మహబూబాబాద్‌ జిల్లా చిన్న గూడూరు గ్రామస్థులు కార్యక్రమానికి హాజరయ్యారు.


సీఎం నివాళులు

న్యూఢిల్లీ, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌ రెడ్డి నివాళులర్పించారు. తుగ్లక్‌ రోడ్‌లోని అధికారిక నివాసంలో ఉదయం దాశరథి చిత్రపటానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాళులర్పించారు.

Updated Date - Jul 23 , 2024 | 07:37 AM

Advertising
Advertising
<