ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: ‘సుంకిశాల ఘటనకు కారణం వారే’

ABN, Publish Date - Aug 09 , 2024 | 04:39 PM

సుంకిశాల ప్రాజెక్టు కూలడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతే కారణం అని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం నాడు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం నాడు ..

Sunkishala Project

నల్లగొండ, ఆగస్టు 09: సుంకిశాల ప్రాజెక్టు కూలడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతే కారణం అని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం నాడు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం నాడు సుంకిశాలలో పర్యటించారు. సుంకిశాలలో నిర్మించిన ప్రాజెక్టు కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు టార్గెట్‌గా సంచలన ఆరోపణలు చేశారు.


తొలుత మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘జరిగిన సంఘటన చిన్నది.. నష్టం కూడా తక్కువే.. ఆ నష్టాన్ని కాంట్రాక్టర్ భరిస్తారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. ప్రాజెక్టు పూర్తి కాలేదు.. నిర్మాణంలో లేదు. నిర్మాణం పూర్తి కావడానికి ఒకటి, రెండు నెలలు పట్టేది. ప్రస్తుతం నిర్మాణం ఆలస్యం కానుంది. గత ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయలేదు. SLBC ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తాం. డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ నాయకులు ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. సుంకిశాల అన్ని పనులు బీఆర్ఎస్ హయంలోనే జరిగాయి.’ అని అన్నారు.


మంత్రి తుమ్మల ఫైర్..

సుంకిశాల ప్రాంతాన్ని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించిందన్నారు. ప్రాజెక్టు కూలిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. జరిగిన నష్టాన్ని నిర్మాణ సంస్థే భరిస్తుందన్నారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామని.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.


గుత్తా సుఖేందర్ రెడ్డి కామెంట్స్..

గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణం జరిగినంత వేగంగా కృష్ణా నది ప్రాజెక్టుల పనులు జరగడం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సుంకిశాల ప్రాజెక్టు ఎందుకు ప్రారంభించారో కేసీఆర్, కేటీఆర్‌కే తెలియాలని వ్యాఖ్యానించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించేందుకు సుంకిశాల అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇది కేసీఆర్ మానస పుత్రికనో లేక కేటీఆర్ మానస పుత్రికనో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు.

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 09 , 2024 | 04:39 PM

Advertising
Advertising
<