ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IT Park: తూర్పు వైపు మరో ఐటీ పార్కు..

ABN, Publish Date - Aug 24 , 2024 | 03:11 AM

హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ఐటీ పార్కులకు తోడు తూర్పువైపు మరో ఐటీ పార్కు తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

  • నెల రోజుల్లోనే విధానపరమైన నిర్ణయం.. హైదరాబాద్‌ నలువైపులా అభివృద్ధి విస్తరణకు చర్యలు

  • ఓఆర్‌ఆర్‌ దాకా మెట్రో: శ్రీధర్‌బాబు

  • క్రెడాయ్‌ ప్రాపర్టీ షో ప్రారంభం

ఉప్పల్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ఐటీ పార్కులకు తోడు తూర్పువైపు మరో ఐటీ పార్కు తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. విధానపరమైన నిర్ణయం అనంతరం నెల రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తామన్నారు. నగరం ఒకే వైపు అభివృద్ధి చెందడం అంత మంచిదికాదని, అందుకే అన్ని వైపులా అభివృద్ధి విస్తరణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నాగోల్‌ మెట్రో స్టేషన్‌ గ్రౌండ్‌లో మూడు రోజులపాటు కొనసాగనున్న క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను శుక్రవారం మంత్రి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరం తూర్పు వైపు ఐటీ పార్కు ఏర్పాటుకు అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఢోకా లేదని, నిర్మాణ రంగం స్తబ్ధుగా ఉందన్నవి పుకార్లు మాత్రమేనని అన్నారు. ప్రాపర్టీ షోల్లో జరుగుతున్న కొనుగోళ్లే ఇందుకు నిదర్శనమన్నారు. ఇటీవల నిర్వహించిన మొదటి ప్రాపర్టీ షోలో రూ.270 కోట్ల ప్రాపర్టీ కొనుగోళ్లు జరిగినట్లుగా క్రెడాయ్‌ ప్రతినిధులు చెప్పారన్నారు.


ఈ ప్రభుత్వం పెట్టుబడులు తెస్తుందా? లేదా? అనే అనుమానాలు ఉండేవని, వాటిని పటాపంచలు చేస్తూ అమెరికా పర్యటనలో రూ.31 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌ విస్తరణతో త్వరలోనే 15 వేల కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన స్కిల్‌ యూనివర్సిటీతో రెండేళ్లలో దేశానికే స్కిల్‌ రాజధానిగా హైదరాబాద్‌ మారుతుందని అన్నారు. మెట్రోరైల్‌ను ఔటర్‌ రింగురోడ్డు వరకు తీసుకెళ్లాలనే ఆలోచన సీఎం రేవంత్‌రెడ్డి దృష్టిలో ఉందని చెప్పారు.


  • అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు..

నగరం ఉత్తరం వైపు జీనోమ్‌ వ్యాలీని విస్తరించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. తూర్పు వైపు మరింత అభివృద్ధి కోసం ఇక్కడ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టార్‌ హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు త్వరలోనే అధ్యయనం చేపడతామన్నారు. రియల్‌ ఎస్టేల్‌ అభివృద్ధి హైరాబాద్‌ అభివృద్ధిలో భాగంగా తమ ప్రభుత్వ భావిస్తోందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ఇది దోహదం చేస్తుందని చెప్పారు. కాగా, రాష్ట్రంలో చురుకైన పాలన ద్వారా నగర రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధి చెందుతోందని క్రెడాయ్‌ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి అన్నారు.


సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో గణనీయంగా పెట్టుబడులు సమీకరించడం శుభసూచకమన్నారు. గత ఐదేళ్లలో ఆఫీస్‌ స్పేస్‌ 1.9 రెట్లు పెరిగిందని తెలిపారు. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌గా హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు ఎన్‌.జైదీ్‌పరెడ్డి మాట్లాడుతూ.. చైల్డ్‌ ఫ్రెండ్లీ ఫీచర్‌లు, ఆధునిక సౌకర్యాలు, పర్యావరణ అనుకూలతతో డెవలపర్లు ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. స్వల్పకాలిక హౌసింగ్‌ ధరలు స్థిరంగా ఉంటాయని భావిస్తున్నా.. దీర్ఘకాలిక దృక్పథం సానుకూలంగా ఉంటుందని క్రెడాయ్‌ ప్రధాన కార్యదర్శి బి.జగన్నాథరావు పేర్కొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 03:11 AM

Advertising
Advertising
<