ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DGP Jitender: నేరస్థులకు శిక్ష పడేలా పోలీసుల కృషి

ABN, Publish Date - Aug 05 , 2024 | 04:25 AM

నేరస్థులను ఉపేక్షించే పరిస్థితి లేదని, న్యాయస్థానాల్లో వారికి శిక్షపడేలా తెలంగాణ పోలీసులు కృషి చేస్తున్నారని డీజీపీ జితేందర్‌ పేర్కొన్నారు. బాధితులకు, ముఖ్యంగా వారిలో మహిళలు, పిల్లలకు అండగా నిలుస్తున్నట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

  • భరోసా కేంద్రాలతో బాధితులకు మద్దతు: డీజీపీ

హైదరాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): నేరస్థులను ఉపేక్షించే పరిస్థితి లేదని, న్యాయస్థానాల్లో వారికి శిక్షపడేలా తెలంగాణ పోలీసులు కృషి చేస్తున్నారని డీజీపీ జితేందర్‌ పేర్కొన్నారు. బాధితులకు, ముఖ్యంగా వారిలో మహిళలు, పిల్లలకు అండగా నిలుస్తున్నట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్రమైన నేరాల విషయంలో దర్యాప్తునకు పటిష్ఠమైన వ్యవస్థను అనుసరిస్తున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది అత్యాచారం, పోక్సో కేసుల్లో 15 మందికి 20 ఏళ్ల జైలు, ఇద్దరికి 25 ఏళ్ల జైలు, 11 మందికి జీవిత ఖైదుతో కలిపి 28 మందికి శిక్ష పడినట్లు పేర్కొన్నారు.


దోషులు తప్పించుకోకుండా పక్కా ఆధారాలతో నేరం రుజువు చేస్తూ చార్జిషీట్‌ దాఖలు చేయడంతోనే తెలంగాణ పోలీసులు ఈ విజయం సాధించారన్నారు. పోలీసు విభాగాలు కేసుల విచారణ సమయంలో భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడితే ఏ మాత్రం సహించబోమని, కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల్లో 95 శాతం నేరాలు పరిచయమున్న వ్యక్తులే చేస్తున్నారన్నారు.

Updated Date - Aug 05 , 2024 | 04:25 AM

Advertising
Advertising
<