ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Railways: తెలంగాణ రైల్వే బడ్జెట్‌ 5,336 కోట్లు..

ABN, Publish Date - Jul 25 , 2024 | 03:19 AM

రైల్వే మౌలిక సదుపాయాల కోసం తెలంగాణకు ఈసారి రూ.5,336 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఇది నాటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి 2009-14 మధ్య ఏటా సగటున కేటాయించిన రూ.886 కోట్ల కన్నా ఆరు రెట్లు అధికమన్నారు.

  • 40 స్టేషన్ల ఆధునికీకరణ పూర్తి

  • వందశాతం రైల్వేమార్గాల విద్యుదీకరణ

  • 32,946 కోట్లతో 2,298 కి.మీ. కొత్త లైన్లు

  • గత పదేళ్లలో 437 ఫ్లైఓవర్లు, అండర్‌ బ్రిడ్జిల నిర్మాణం

  • రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌ సిటీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రైల్వే మౌలిక సదుపాయాల కోసం తెలంగాణకు ఈసారి రూ.5,336 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఇది నాటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి 2009-14 మధ్య ఏటా సగటున కేటాయించిన రూ.886 కోట్ల కన్నా ఆరు రెట్లు అధికమన్నారు. బుధవారం అశ్వనీ వైష్ణవ్‌ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో రూ.32,946 కోట్ల వ్యయంతో 2,298 కి.మీ.ల మేర కొత్త రైల్వే మార్గం పనులు జరుగుతున్నాయని తెలిపారు. 40 రైల్వే స్టేషన్లలో విస్తృతస్థాయిలో మరమ్మతులు జరిపి పూర్తిగా ఆధునికీకరించామని, వాటిని అమృత్‌ స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.


రాష్ట్రంలో నూటికి నూరు శాతం రైల్వే విద్యుదీకరణ జరిగిందన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి కనీవినీ ఎరుగని స్థాయిలో జరుగుతోందని మంత్రి తెలిపారు. 2009-14 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏటా సగటున 17 కి.మీ.ల కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, 41 కి.మీ. లైన్ల విద్యుదీకరణ జరిగితే తాము గత పదేళ్లలో కేవలం తెలంగాణలోనే ఏటా 65 కి.మీ. కొత్త లైన్ల నిర్మాణం, 110 కి.మీ. లైన్ల విద్యుదీకరణ పూర్తి చేశామన్నారు. 2014 నుంచి తెలంగాణలో 437 రైల్వే ఫ్లైఓవర్లు, అండర్‌ బ్రిడ్జిలను నిర్మించామని చెప్పారు.


చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభానికి సిద్ధం

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభానికి సిద్ధంగా ఉందని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ చెప్పారు. టెర్మినల్‌ను ప్రారంభించే విషయమై త్వరలోనే రైల్వే శాఖ ప్రకటన చేయనుందన్నారు. హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తుందా? అని విలేకరులు అడగ్గా.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా, సహకరించకున్నా చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేస్తామని జైన్‌ తెలిపారు. నాంపల్లి- సికింద్రాబాద్‌ మార్గంలో ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడవకపోవడంపై జీఎం స్పందిస్తూ.. నాంపల్లి నుంచి సికింద్రాబాద్‌ మీదుగా ఉమ్డానగర్‌ వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తున్నాయని చెప్పడం గమనార్హం. ఈ మార్గంలో ఒక్క ఎంఎంటీఎస్‌ కూడా నడవడం లేదన్న విషయాన్ని తెలియనివ్వకుండా ఉన్నతాధికారులు ఆయన్ను తప్పుదోవ పట్టిస్తున్నారని పలువురు రైల్వే ఉద్యోగులు చెబుతున్నారు.

Updated Date - Jul 25 , 2024 | 03:19 AM

Advertising
Advertising
<