Revanth Govt: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: కీలక నిర్ణయాలు!
ABN, Publish Date - May 24 , 2024 | 08:04 PM
జూన్ 2వ తేదీ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్బావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సమాయత్తమైంది. అందులోభాగంగా ఆ రోజు పలు కీలక నిర్ణయాలను ఈ సర్కార్ ప్రకటించనుందని తెలుస్తుంది.
హైదరాబాద్, మే 24: జూన్ 2వ తేదీ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్బావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సమాయత్తమైంది. అందులోభాగంగా ఆ రోజు పలు కీలక నిర్ణయాలను ఈ సర్కార్ ప్రకటించనుందని తెలుస్తుంది. రాష్ట్ర అధికార గీతంగా జయ జయ హే తెలంగాణ పాటను ప్రభుత్వం విడుదల చేయనుంది.
LokSabha Elections: అమిత్ షాకు లైన్ క్లియర్ చేస్తున్న మోదీ
అలాగే ప్రభుత్వ అధికారిక చిహ్నంతోపాటు తెలంగాణ తల్లి రూపాన్ని సైతం ఆవిష్కరించనుంది. అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సైతం ఈ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. అందుకోసం జాబితాను ప్రభుత్వం సిద్దం చేసే పనిలో నిమగ్నమైంది.
Kedarnath: గాలిలో హెలికాఫ్టర్ చక్కర్లు.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ భక్తులు
మరోవైపు రాష్ట్ర అధికారిక దినోత్సవం సందర్బంగా జయ జయ హే తెలంగాణ గీత రచయిత అందెశ్రీతోపాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సమావేశమయ్యారు. రాష్ట్ర గీతం వీనుల విందుగా రూపొందించేందుకు వారికి సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేసినట్లు సమాచారం.
Yadadri: భక్తులకు గుడ్ న్యూస్.. స్వామి వారి సేవలు ఇకపై ఆన్‌లైన్‌లో..
ఇక గత కేసీఆర్ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్రాన్ని టీఎస్‌గా మారిస్తే.. దానిని టీజీగా రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా సవరించింది. ఇది జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి తీసుకు రానుంది. అదీకాక.. గతేడాది చివరల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు తీరింది.
Rajinikanth: రజనీకాంత్‌కు యూఏఈ గోల్డెన్ వీసా
రేవంత్.. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ వేడుకలు. ఇందులో రేవంత్ రెడ్డి మార్క్ కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ నేపథ్యంలో వేడుకల కోసం తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించగా, అందుకు ఈసీ అంగీకారం తెలిపింది.
Read Latest News and National News here
Updated Date - May 24 , 2024 | 08:12 PM