Warangal: రెండో రాజధానిగా వరంగల్ : పొంగులేటి
ABN , Publish Date - Nov 04 , 2024 | 03:41 AM
రాష్ట్రంలో రెండో రాజధానిగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్ విచ్చేసిన మంత్రి పొంగులేటి.. స్థానిక భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
వరంగల్ కల్చరల్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండో రాజధానిగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్ విచ్చేసిన మంత్రి పొంగులేటి.. స్థానిక భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, భద్రకాళి చెరువు ఆక్రమణలను తొలగించి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
భద్రకాళి జలాశయాన్ని మంచినీటి రిజర్వాయర్‌గా మారుస్తామని తెలిపారు. ఇక, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మామునూరు విమానాశ్రయం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.